మోహన్ లాల్ హీరోగా నటించి ‘లూసిఫర్’ చిత్రం 2019లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి సీక్వెల్ గా అదే కాంబినేషన్ లో వస్తున్న మూవీ ‘L2E ఎంపురాన్’ (రాజు కన్నా గొప్పవాడు). కాగా ఈ సినిమా మలయాళ, తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో మార్చి 27న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.కంటెంట్ సినిమాలతో పాటు.. స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించే, లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తోంది. మొదటి భాగం భారీ హిట్ కావటంతో, సినిమాపై ప్రేక్షకులకు ఎలాంటి అంచనాలున్నాయో ముందుగానే అంచనా వేసిన మేకర్స్.. ఈ పార్ట్2 ని ఎక్స్‌పెక్టేషన్స్‌ను మించేలా నిర్మిస్తున్నారు. దీంతొ అనౌన్స్‌మెంట్ రోజు నుంచే సినిమా ఎలా ఉంటుందోనని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Also Red:Prabhas: ‘కల్కి 2898 ఎడి 2’ కి సర్వం సిద్ధం..నాగ్ అశ్విన్ నుండి ఎగ్జైటింగ్ అప్‌డెట్
ఇక విడుదల సమయం దగ్గరపడుతుండటంతో ప్రమోషన్‌లు మొదలు పెట్టారు మూవీ టీం. ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ నిన్న జరిగిన ఒక గ్రాండ్ ఈవెంట్‌లో విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా పృథ్వీరాజ్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు.. పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ ‘లైకా ప్రొడక్షన్స్ సంస్థ గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్ తో దర్శకుడిగా ఓ సినిమా చేయమని నన్ను సంప్రదించింది. నాలాంటి యువ దర్శకుడికి ఆ అవకాశం చాలా గొప్పది. పైగా అది నా కల కూడా. కానీ నా ఆశ అడియాశ అయింది ఆ ప్రాజెక్టు అనుకున్నట్లుగా ప్రారంభం కాలేదు. నిర్మాణ సంస్థకి నచ్చే విధంగా ఓ గొప్ప కథను నేను ఆ సమయంలో రాయలేకపోయాను’ అని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు. కచ్చితంగా ఇంకో అవకాశం కోసం వైట్ చేస్తున్న అని తెలిపారు.