రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కల్కి 2898 ఏడీ’. గత ఏడాది భారీ అంచానాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. రూ.1000 కోట్లకు పైగా వసూలు సాధించడం మాత్రమే కాకుండా, ప్రేక్షకులను ఈ మూవీ మరో కొత్త ప్రపంచానికి తీసుకెళ్లింది. కలియుగం అంతం అయిన తర్వాత పరిణామాలను.. మహాభారతంతో లింక్ చేసి, దర్శకుగు నాగ్ అశ్విన్ కథను తీసిన తీరుకు అందరు ఫిదా అయ్యారు. రేపటి కోసం.. అంటూ ఫ్యూచర్‌ని కళ్లకు కట్టినట్లుగా చూపించాడు. ఇక మొదటి పార్ట్ లో గర్భంతో ఉన్న దీపికా పదుకునే పాత్ర సెకండ్ పార్ట్‌లో మరింత కీలకంగా ఉండే అవకాశం ఉంది. దీంతో ప్రేక్షకులంతా ఈ ‘కల్కి 2898 ఎడి 2’ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఈ పార్ట్ టూ పై దర్శకుడు నాగ్ అశ్విన్ ఎగ్జైటింగ్ అప్డేట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘ప్రస్తుతం ఈ సినిమా తాలుకా స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యింది. ఇక ప్రభాస్ నుంచి షూటింగ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అలస్యం.. ఒక సారి ‘కల్కి 2’ రాకకు ప్రభాస్ సినిమా కోసం సిద్ధం అయితే , అన్నీ సెట్టయితే మూవీ పూర్తి చేయడానికి ఎంతో సమయం తీసుకోదు. అని అనుకున్నట్టుగా జరిగితే ఈ చిత్రాన్ని 2026 ఎండింగ్ లో అలా విడుదల చేసే ఆలోచనలో ఉన్నాం. ఆల్రెడీ ప్రభాస్ లేని సీన్స్, షూటింగ్ సెట్టింగ్స్.. ఇతర వర్క్ చాలానే పూర్తి చేశారు. సో ఈ సినిమా అనుకున్న సమయానికి వచ్చే ఛాన్స్ లు ఉన్నాయి’ అంటూ తెలిపాడు. ప్రజంట్ నాగ్ మాటలు అభిమానుల గుండెల్లో ఆనందాల నింపాయి.