శివ కార్తికేయన్, అనుదీప్ కాంబినేషన్ లో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది ‘ప్రిన్స్’ చిత్రం. ఈ సినిమా టైటిల్ పెట్టడం కంటే ముందే మూవీని ఆగస్ట్ 31న విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. అయితే ఇప్పుడా విడుదల తేదీ మారింది. దీపావళి కానుకగా తమ ‘ప్రిన్స్’ వస్తాడని తెలిపారు.
ఈ పక్కా ఎంటర్ టైనర్ ‘ప్రిన్స్’కు సంబంధించి హీరో శివ కార్తికేయన్, హీరోయిన్ మరియా ర్యాబోషప్క ఉన్న ఫస్ట్ లుక్ ను ఇటీవల విడుదల చేసింది యూనిట్. చాలా రిఫ్రెషింగ్ కనిపించిన ఈ జోడీ నెటిజన్లను బాగాఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉందని చెబుతూ, తాజాగా ఒక హిలేరియస్ వీడియో ద్వారా సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్రయూనిట్. ఈ వీడియోలో.. శివకార్తికేయన్, అనుదీప్ సినిమా ఆలస్యానికి సత్యరాజ్‌ను నిందించారు. అయితే సత్యరాజ్ ఎంటరైన తర్వాత ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. తర్వాత హీరోయిన్ మారియా వచ్చి వారితో మాట కలిపింది. తెలుగు, తమిళ, ఇంగ్లీష్ భాషలలో ఈ సంభాషణ జరుగుతుంది. చివరిగా.. ఈ దీపావళికి ‘ప్రిన్స్’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
‘జాతి రత్నాలు’తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న అనుదీప్ ప్రమోషనల్ మెటిరియల్ కూడా ప్రత్యేకంగా, వినోదాత్మకంగా ఉండేలా చూసుకుంటున్నారు. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోనాలి నారంగ్ ఈ మూవీకి ప్రెజెంటర్. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి అరుణ్ విశ్వ సహ నిర్మాత.
https://www.youtube.com/watch?v=GoA-0tHI_4k