Prince Trailer: జాతిరత్నాలు సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు దర్శకుడు కేవీ అనుదీప్. ఈ సినిమా తరువాత డైరెక్ట్ గా బై లింగువల్ సినిమానే తీయడానికి రెడీ అయిపోయాడు. కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ హీరోగా అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ప్రిన్స్.
శివ కార్తికేయన్, అనుదీప్ కాంబినేషన్ లో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది ‘ప్రిన్స్’ చిత్రం. ఈ సినిమా టైటిల్ పెట్టడం కంటే ముందే మూవీని ఆగస్ట్ 31న విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. అయితే ఇప్పుడా విడుదల తేదీ మారింది. దీపావళి కానుకగా తమ ‘ప్రిన్స్’ వస్తాడని తెలిపారు. ఈ పక్కా ఎంటర్ టైనర్ ‘ప్రిన్స్’కు సంబంధించి హీరో శివ కార్తికేయన్, హీరోయిన్ మరియా ర్యాబోషప్క ఉన్న ఫస్ట్ లుక్ ను ఇటీవల విడుదల చేసింది…