Prime minister of Malaysia greets Superstar Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనడంలో సందేహం లేదు. కేవలం ఇండియాలోనే కాక జపాన్, మలేషియా లాంటి దేశాల్లో కూడా రజనీ అంటే చెవి కోసుకుని అభిమానులు ఎంతో మంది ఉన్నారు. ఇక తాజాగా మలేషియా పర్యటనలో ఉన్న రజనీకాంత్ ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. ఇద్దరు ప్రధానమంత్రి కార్యాలయంలో ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న వీడియో షేర్ చేశారు. జైలర్ హీరో రజినీకాంత్ తెల్లటి చొక్కాతో తెల్లని ధోతీని ధరించి కనిపించారు. ఇక ఈ విషయాన్ని ఒక వీడియోను, కొన్ని ఫోటోలను ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం సోషల్ మీడియాలో షేర్ చేశారు. నేను భారత చలనచిత్ర నటుడు రజనీకాంత్ తో భేటీ అయ్యాను, ఆయన ఆసియా సహా అంతర్జాతీయ కళా ప్రపంచ వేదికపై సుపరిచితులు.
Pallavi Prashanth: పాపం పులిహోర బిడ్డ.. హౌస్ మేట్స్ లాజిక్స్ కి జావగారిపోయాడు!
ముఖ్యంగా ప్రజల కష్టాలు, కష్టాల విషయంలో నా పోరాటానికి ఆయన ఇచ్చిన గౌరవాన్ని అభినందిస్తున్నాను, క్యాజువల్‌గా మేము కొన్ని విషయాలు చర్చించినా, భవిష్యత్తులో ఆయన సినిమాల్లో నేను ప్రయత్నిస్తున్న సామాజిక అంశాలు చేర్చే విషయంలో కూడా చర్చించామని న్నారు. ఇక రజనీకాంత్ సినిమా ప్రపంచంలో రాణించాలని ప్రార్థిస్తున్నాను” అన్నారు. రజనీ సినిమాల విషయానికి వస్తే ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రూ.600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన జైలర్, OTT విడుదలైనప్పటికీ థియేటర్లలో రన్ అవుతూ వసూళ్లను అందుకుంటుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 7న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవడం మొదలైంది. ఇప్పుడు ఆ ప్లాట్‌ఫారమ్‌లో అత్యధికంగా వీక్షించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇక మరో పక్క రజనీకాంత్ హీరోగా జైలర్ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ మరో సినిమాను అనౌన్స్ చేసింది. లోకేష్ కనగారాజ్ డైరెక్షన్లో రజనీ 157వ సినిమా చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించింది.
Hari ini saya menerima kunjungan bintang filem India, Rajinikanth yakni satu nama yang tidak asing lagi di pentas dunia seni asia dan antarabangsa.
Saya hargai penghormatan yang diberikan beliau terhadap perjuangan saya khasnya terkait isu kesengsaraan dan penderitaan rakyat.… pic.twitter.com/Sj1ChBMuN6
— Anwar Ibrahim (@anwaribrahim) September 11, 2023