Premam movie director Alphonse Puthren quits film direction: సాయి పల్లవితో బ్లాక్ బస్టర్ ప్రేమమ్ మూవీ చేసిన తీసిన మలయాళ డైరెక్టర్ అల్ఫోన్స్ పుత్రన్, తాను సినిమా డైరెక్షన్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అల్ఫోన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక నోట్ ఈమేరకు షేర్ చేశారు. తాను ఒక రోగంతో బాధపడుతున్నాను అని అనౌన్స్ చేసి ఆ తర్వాత పోస్ట్‌ను తొలగించారు. ఆయన ముందు షేర్ చేసిన పోస్ట్ ఇలా ఉంది, “నేను నా సినిమా థియేటర్ కెరీర్‌ను ఆపివేస్తున్నా, నేను ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్‌ని కలిగి ఉన్నానని నిన్న స్వయంగా కనుగొన్నాను. మరెవరికీ భారం కాకూడదనుకుంటున్నా, నేను పాటలు, వీడియోలు -షార్ట్ ఫిల్మ్‌లు అలాగే OTT కోసం సినిమాలు చేస్తూనే ఉంటా. నేను సినిమా నుండి తప్పుకోవాలనుకోలేదు, కానీ నాకు వేరే మార్గం లేదు. నేను నిలబెట్టుకోలేని వాగ్దానాలు చేయడం నాకు ఇష్టం లేదు. ఆరోగ్యం బలహీనంగా ఉన్నప్పుడు, జీవితం ఇంటర్వెల్ బ్లాక్ ఇచ్చినట్టే అర్ధం చేసుకోవాలని అంటూ ఆయన రాసుకొచ్చారు.
Brahmanandam: ఒకేసారి ఐదు సినిమాలు ఒక సంచలనం!
అంతేకాక ఆ పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చాడు, “నేను ఆరోగ్యంగా లేనందుకు ప్రతి ఒక్కరు నన్ను క్షమించండి. కారణం ఏమిటో నాకు తెలియదు కానీ నాకు చిన్నప్పటి నుండి ఈ సమస్య ఉంది, ఆటిజం గురించి అర్థం చేసుకున్న తర్వాత నేను అదే అనుకుంటున్నాను. అందుకే సినిమాలు ఆలస్యమవుతోందని అంచనా. కానీ నేను మీ అందరికీ వినోదాన్ని అందించడం ఆపనని రాసుకొచ్చారు. నిజానికి అల్ఫోన్స్ ఫహద్ ఫాసిల్‌తో ఒక సినిమా ప్రకటించారు. దాదాపు 7 సంవత్సరాల తర్వాత అల్ఫోన్స్ దర్శకత్వంలో పృథ్వీరాజ్, నయనతార, సెంబన్ వినోద్ సహా పలువురు మలయాళ నటీనటులు నటించిన ‘గోల్డ్’ గత ఏడాది డిసెంబర్ 29న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలైంది. గోల్డ్ మిశ్రమ సమీక్షలకు అందుకున్న క్రమంలో విమర్శిస్తూ అల్ఫోన్స్ పుత్రన్ చేసిన ఫేస్‌బుక్ పోస్ట్ కూడా వైరల్‌గా మారడంతో ఆయన దానిని తొలగించడం గమనార్హం. ప్రస్తుతం ఆయన గిఫ్ట్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.