Brahmanandam Comments at Upendra gadi Adda Pre Release Event: ఒక సినిమా తీయడానికి అనేక ఇబ్బందులు పడుతున్న ఈ రోజుల్లో ఒకేసారి ఐదు సినిమాలు చేస్తుండటం నిజంగా ఓ సంచలనం అని హాస్య నటుడు బ్రహ్మానందం అన్నారు. కంచర్ల ఉపేంద్ర హీరోగా, సావిత్రి కృష్ణ హీరోయిన్ గా, ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వంలో ఎస్ఎస్ఎల్ఎస్ (SSLS) క్రియేషన్స్ బ్యానర్ పై కంచర్ల అచ్యుతరావు “ఉపేంద్ర గాడి అడ్డా” అనే సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఇదే బ్యానర్ లో ఇదే హీరోతో తీస్తున్న ఐదు సినిమాల టీజర్లను బ్రహ్మానందం విడుదల చేశారు. “ఉపేంద్ర గాడి అడ్డా” సినిమా ట్రైలర్ ను, నరసింహ నంది దర్శకత్వంలో ఈ నిర్మాత చేయబోతున్న ఆరో సినిమా “1920 భీమునిపట్నం” పోస్టర్ ను ఈ సైతం బ్రహ్మానందం విడుదల చేశారు.
ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ మా అబ్బాయి కూడా హీరో, ఇలాంటి కొత్త హీరోలను ఆశీర్వదించినపుడు మా అబ్బాయిని కూడా భగవంతుడు ఆశీర్వదిస్తాడన్న ఉద్దేశ్యంతో ఈ ఫంక్షన్ కు వచ్చానని అన్నారు. కుమారుడ్ని హీరోగా పరిచయం చేయడమే కాదు ఒకేసారి అచ్యుతరావు ఒక ఫ్యాక్టరీ లాగా ఒకేసారి ఐదు సినిమాలు చేస్తుండటం అభినందనీయం అలా చేయడం వల్ల పరిశ్రమను నమ్ముకున్న వారికి అవకాశాలు ఇచ్చి, భోజనం పెట్టినట్లవుతుందని అన్నారు. తన కుమారుడి పట్ల ఆయనకున్న ప్రేమ, నమ్మకానికి ఇది ఓ నిదర్శనం అని పేర్కొన్న ఆయన ఈ ఐదు సినిమాల టీజర్స్ ను చూస్తుంటే వేటికవే విభిన్నమైన కమర్షియల్ సినిమాలుగా అనిపిస్తున్నాయని అన్నారు. ఇక హీరో కంచర్ల ఉపేంద్ర మాట్లాడుతూ , “నా పుట్టిన రోజు సందర్భంగా నాతో మా నాన్న తీస్తున్న ఐదు సినిమాల టీజర్స్ ను విడుదల చేస్తూ, ఇంత భారీగా ఈ కార్యక్రమం జరుపుతుండటం నాకో వెలకట్టలేని పెద్ద బహుమతి అని ఇంతమంది ఆత్మీయులు, శ్రేయోభిలాషుల, పరిశ్రమ వారు అందజేసిన ఆశీస్సులు నాకు వరాలు అవుతాయనని అన్నారు.