Dr.Priya: రెండు రోజుల క్రితమే మలయాళ నటి రెంజుషా మీనన్ ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు రెంజుషా మీనన్ మృతికి కారణాలు తెలియరాలేదు. ఇక ఆమె చనిపోయిన రెండు రోజులకే మరో నటి మృతిచెందడం ఇండస్ట్రీలో కలకలం సృష్టిస్తోంది. బుల్లితెర నటి, డాక్టర్ ప్రియ గుండెపోటుతో మృతి చెందింది. ఎనిమిది నెలల గర్బవతి అయిన ప్రియ చెకప్ కోసం ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు వచ్చింది. చెకప్ లో భాగంగా ప్రియకు గుండెపోటు రావడంతో వెంటనే చికిత్స కోసం తరలించినా.. ఆమె ప్రాణాలను నిలుపలేకపోయారు. కానీ, ఎనిమిది నెలల బిడ్డను మాత్రం కాపాడగలిగారు. ప్రస్తుతం బిడ్డను ఇంకుబేటర్ లో ఉంచి చికిత్సను అందిసున్నారు. ప్రియ మరణవార్తను నటుడు కిషోర్ సత్య సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.
Pawan Kalyan: ఎక్కడ ఉన్నాడో పట్టుకొని కొన్ని ఫోటోలు దింపండయ్యా..
“మలయాళ టెలివిజన్ రంగంలో మరో ఊహించని మరణం. డాక్టర్ ప్రియా నిన్న గుండెపోటుతో మరణించారు. ఆమె 8 నెలల గర్భిణి. పాప ఐసీయూలో ఉంది. ఇతర ఆరోగ్య సమస్యలు లేవు. ఒక్కగానొక్క కూతురు మరణాన్ని తట్టుకోలేక విలపిస్తున్న తల్లి. 6 నెలలుగా ఎక్కడికీ వెళ్లకుండా ప్రియను కంటికి రెప్పల కాపాడుకుంటున్న భర్త బాధను నేను తట్టుకోలేకపోయాను. నిన్న రాత్రి ఆసుపత్రికి వెళుతుండగా నా మనసులో విషాదం వర్షంలా కురిసింది. వారిని ఓదార్చడానికి మీరు ఏమి చెబుతారు? నమ్మిన ఆ అమాయకపు మనసులపై దేవుడు ఈ క్రూరత్వాన్ని ఎందుకు ప్రదర్శించాడు?” అంటూ రాసుకొచ్చాడు. ఇకపోతే డా. ప్రియ మలయాళ టెలివిజన్‌లో సుపరిచితురాలు. కరుతముత్తు అనే సీరియల్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే పెళ్లి తర్వాత నటనకు విరామం తీసుకుంది. ప్రియ మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.