DVV Danayya Son’s Debut : ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత డివివి దానయ్య తనయుడు కళ్యాణ్ కథానాయకుడిగా తన సినీ రంగ ప్రవేశం చేయబోతున్నాడు. కళ్యాణ్ లాంచ్ ప్యాడ్ కోసం చాలా మంది దర్శకులను పరిశీలించారు దానయ్య. వారసుడి ఎంట్రీ బాధ్యతలను యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు అప్పగించినట్లు టాక్ నడుస్తోంది. యంగ్ హీరో తేజ సజ్జను హీరోగా పరిచయం చేసి, తేజతోనే హను-మాన్ అనే సూపర్ హీరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మను కళ్యాణ్ తొలి చిత్రానికి దర్శకత్వం వహించడానికి ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
Read Also : RRR : రికార్డు బ్రేకింగ్ ప్రీ సేల్స్… యూఎస్ లో నందమూరి ఫ్యాన్స్ రచ్చ
ప్రస్తుతం ప్రశాంత్ వర్మ ఓ ప్రత్యేకమైన కథను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇక కళ్యాణ్ హీరోగా మారేందుకు నటన, ఫైట్స్ తదితర అంశాల్లో శిక్షణ తీసుకున్నాడు. పూర్తిగా యంగ్ టెక్నీషియన్స్‌తో ఈ సినిమా చాలా లావిష్‌గా రూపొందనుంది. ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. మరోవైపు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కోసం డివివి దానయ్య ఎదురు చూస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ మార్చ్ 25న విడుదలకు సిద్ధంగా ఉంది.