Prashanth Varma about Accidents in Hanuman Shoot: హనుమాన్ సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో రెండు పెద్ద ప్రమాదాల నుంచి తేజ బయటపడినట్లు దర్శకుడు ప్రశాంత్ వర్మ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ప్రశాంత్ వర్మ ఈ రెండు ప్రమాదాల గురించి చెప్పుకొచ్చారు. ఒకసారి మారేడుమిల్లిలో డీప్ ఫారెస్ట్ లో షూట్ చేస్తున్న సమయంలో తేజ భుజం దగ్గర నాగుపాము నిలబడి ఉందని తేజ కి యాక్షన్ చెబుతున్న సమయంలో అక్కడ ఏదో ఉందని తనకు మానిటర్ లో అర్థమవుతుంది కానీ అది పామనే విషయం అర్థం కావడానికి సమయం పట్టింది అని చెప్పుకొచ్చారు. తన పక్కనే ఉన్న తన అసిస్టెంట్ ఈ విషయం చెప్పడానికి రెండు మూడు సార్లు ప్రయత్నించి షూటింగ్ ఇబ్బంది కలుగుతుందేమోనని ఆగిపోయాడని తర్వాత తేజ పక్కన పాము ఉందనే విషయం చెప్పడంతో వెంటనే అందరూ అక్కడికి వెళ్లి ఆ పాముని పక్కకు తప్పించి తేజ అని పక్కకు లాక్కొచ్చామని చెప్పుకొచ్చాడు.
Nayanthara: నటి నయనతారపై కేసు నమోదు.. శ్రీరాముడిని అగౌరపరిచారని ఫిర్యాదు..
అలాగే ఒంగోలు గిత్తలతో ఒక ఎపిసోడ్ షూట్ చేస్తున్న సమయంలో డ్రోన్ సౌండ్ విని అవి షార్ట్ మధ్యలో పారిపోయాయి, అయితే అదృష్టం కొద్దీ అవి లోయలోకి పరిగెత్తకుండా పక్కకు పరిగెత్తుకొచ్చాయి. ఒకవేళ అవి ఈ పక్కకి పరిగెత్తకుండా లోయలోకి పరిగెడితే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది అని ప్రశాంత్ వర్మ పేర్కొన్నారు. ఇక ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత సినిమా టీం మొత్తం భయపడిపోయింది. అయితే మేము చేసిన ఈ రిస్కీ షాట్స్ తెరమీద మాత్రం ఒక రేంజ్ లో ఆకట్టుకుంటాయి అని ఆయన చెప్పుకొచ్చారు.