Dude : తమిళ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ మరో రికార్డు అందుకున్నాడు. వరుసగా మూడు సార్లు వంద కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ డ్యూడ్. ఇందులో మమితా బైజు హీరోయిన్ గా నటించింది. శరత్ కుమార్, నేహాశెట్టి కీలక పాత్రలు పోషించగా… కీర్తీశ్వరన్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా అందరూ ఊహించినట్టే రూ.100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. రిలీజ్ అయిన ఆరు రోజుల్లోనే ఈ ఘనత సాధించిందని నిర్మాణ సంస్థ తాజాగా ప్రకటించింది. దీపావళి సీజన్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిందని తెలిపింది నిర్మాణ సంస్థ. డ్యూడ్ సినిమా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా వచ్చింది. భార్యను ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త అనే కాన్సెప్టు ద్వారా తెరకెక్కింది ఈ మూవీ.
Read Also : Janhvi Kapoor : రామ్ చరణ్, ఎన్టీఆర్ మీదనే జాన్వీకపూర్ ఆశలు..
అసలే ఇప్పుడు పెళ్లి తర్వాత లవర్లతో వెళ్లిపోతున్న భార్యల ఘటనలు ఎక్కువ అవుతున్న సందర్భంలో ఈ మూవీ రావడం బాగా కనెక్ట్ అయింది. పైగా తెలుగునాట ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది. ప్రదీప్ ఇప్పటికే ‘లవ్‌టుడే’, ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ సినిమాల్లో నటించగా.. అవి కూడా రూ.100 కోట్ల క్లబ్ లో చేరిపోయాయి. ఇప్పుడు డ్యూడ్ కూడా ఆ ఘనత అందుకుంది. వరుసగా మూడు సినిమాలు వంద కోట్ల క్లబ్ లో చేరిపోవడంతో ప్రదీప్ రంగనాథన్ స్టార్ హీరోల లిస్టులో చేరిపోతున్నాడు.
Read Also : Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్ కు నిరాశ.. ప్రశాంత్ నీల్ ఇలా చేశావేంటి..?