కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ బ్యాక్ టు బ్యాక్ రెండు వెయ్యి కోట్ల సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఏ ఇండియన్ హీరోకి కలలో కూడా సాధ్యం కానీ రేర్ ఫీట్ ని సొంతం చేసుకున్న షారుఖ్ ఖాన్… ఒకే ఏడాదిలో మూడో వెయ్యి కోట్ల సినిమాని సాధించడానికి రాజ్ కుమార్ హిరానీతో కలిసి ‘డుంకి’ సినిమా చేస్తున్నాడు. ఈ ఏడాది డిసెంబర్ 22న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీపై బాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. పఠాన్, జవాన్ కాదు డుంకి అసలైన షారుఖ్ సినిమా. ఆ మూవీ క్రియేట్ చేయబోయే సెన్సేషన్ ఎలా ఉండబోతుందో చూడండి అంటూ బాలీవుడ్ మీడియా కూడా డుంకి సినిమా గురించి హైప్ పెంచుతుంది. అయితే ఇప్పుడు డుంకి సినిమాకి, కింగ్ ఖాన్ షారుఖ్ కి షాక్ ఇస్తూ డైనోసర్ లైన్ లోకి వచ్చింది. సెప్టెంబర్ 28 నుంచి వాయిదా పడిన సలార్ సినిమా కొత్త రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఆ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ సలార్ సినిమా డిసెంబర్ 22న రిలీజ్ చేస్తున్నట్లు హోంబలే అనౌన్స్ చేసింది. దీంతో డుంకి సినిమాకి సలార్ కి బాక్సాఫీస్ వార్ భారీగా జరగడం గ్యారెంటీ అయ్యింది. ఈ వార్ ఏ రేంజులో ఉండబోతుందో ఊహించి చెప్పడం కూడా కష్టమే. ఇంకా కరెక్ట్ గా చెప్పాలి అంటే సలార్, డుంకి సినిమాలు డిసెంబర్ 22నే రిలీజ్ అవుతాయా అంటే ఆ టైంకి ఎదో ఒకటి వాయిదా పడడం గ్యారెంటీగా కనిపిస్తోంది.
ఎందుకంటే ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ఒకే డేట్ కి సినిమాలని రిలీజ్ చేస్తే థియేటర్స్ విషయం నుంచి ప్రతి మ్యాటర్ లో ఎదో ఒక సినిమాకి అన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా ఒకప్పుడు షారుఖ్ ఖాన్ ఉన్న ఫామ్ కి ఇప్పుడున్న ఫామ్ కి చాలా తేడా ఉంది. పఠాన్ కి ముందు అయితే షారుఖ్ వీక్ గా ఉన్నాడు కాబట్టి తనపై పోటీగా సినిమాని వదిలినా ఆడియన్స్ పెద్దగా కన్ఫ్యుస్ అయ్యే వారు కాదు కానీ ఇప్పుడు అలా కాదు షారుఖ్ ఖాన్ సూపర్బ్ ఫామ్ లో ఉన్నాడు. నార్త్ ఆడియన్స్ అండ్ ఓవర్సీస్ ఆడియన్స్ డుంకి సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సింపుల్ గా చెప్పాలి అంటే సలార్ సినిమాకి పర్ఫెక్ట్ పోటీ దొరికింది. ఇద్దరూ వెనక్కి తగ్గకుండా సలార్-డుంకి సినిమాలని రిలీజ్ చేయడానికి ముందుకొచ్చారు కాబట్టి ఇండియన్ బాక్సాఫీస్ ఒక్క వారం రోజుల్లోనే మినిమమ్ రెండు వేల కోట్ల కలెక్షన్స్ ని చూస్తుంది. ఈ క్లాష్ లాక్ అయ్యింది కాబట్టి ఇక ఈ వార్ లో గెలిచే వాళ్లే ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ గా నిలుస్తారు.