Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సలార్. కెజిఎఫ్ తో భారీ హిట్ ను అందుకున్న హోంబాలే ఫిల్మ్స్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. గతేడాది డిసెంబర్ 22 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. రికార్డ్ కలక్షన్స్ రాబట్టి.. ప్రభాస్ సత్తా ఏంటో మరోసారి నిరూపించింది. దేవ, వరదల మధ్య స్నేహం .. పగగా ఎలా మారింది. ఇద్దరు స్నేహితులు బద్ద శత్రువులుగా ఎలా మారారు అన్నదే సలార్ కథ. ఇక దేవాగా ప్రభాస్ నటించగా.. వరదగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించాడు. దాదాపు ఈ సినిమా రూ. 600 కోట్లకు పైగా కలక్షన్స్ రాబట్టింది. ఆరేళ్లుగా ప్రభాస్ ఫ్యాన్స్ ఎలాంటి విజయం కోసం ఎదురుచూశారో.. అలాంటి విజయం సలార్ అందించింది.ఇక ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ను కూడా అంతే గ్రాండ్ గా జరుపుకున్నారు చిత్ర బృందం. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ శృతి హాసన్.. దేవా, వరదలను ఇంటర్వ్యూ చేసి షాక్ ఇచ్చింది.
ఇక ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్, పృథ్వీరాజ్.. సలార్ గురించి, ప్రశాంత్ నీల్ మేకింగ్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ప్రభాస్.. తన 21 ఏళ్ల కెరీర్ లో చాలా కంఫర్టబుల్ అయిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. ” నా 21 ఏళ్ళ కెరీర్ లో ప్రశాంత్ నా ఫేవరేట్ మరియు చాలా కంఫర్టబుల్ డైరెక్టర్. నాకు ముందు వినాయక్ సర్.. ఆయనతో చేయడం నాకు చాలా కంఫర్ట్.. అది కేవలం 6 నెలలు.. ఇది దాదాపు రెండేళ్లు.. ఇంకా పార్ట్ 2 లో కూడా. అతనితో వర్క్ చేయడం చాలా నచ్చుతుంది. చెప్పాలంటే.. షూట్ తరువాత కూడా అతనిని కలవాలనిపిస్తుంది. ప్రశాంత్.. చాలా కూల్.. ఛలోక్తులు విసురుతాడు. అతని దృష్టిలో యాక్టర్స్ అంటే దేవుళ్లు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.