ఎవడే సుబ్రమణ్యం, మహానటి, పిట్ట కథలు వంటి చిత్రాలతో టాలీవుడ్ లో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్. ఈరోజు ఈ యంగ్ డైరెక్టర్ పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ ఆయనను విష్ చేస్తూ స్వీటెస్ట్ నోట్ షేర్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో నాగ్ అశ్విన్ ఫోటోను పంచుకుంటూ “నాకు తెలిసిన స్వీటెస్ట్ డైరెక్టర్స్ లో ఒకరైన నాగ్ అశ్విన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. Project Kకి ధన్యవాదాలు. త్వరలో మిమ్మల్ని సెట్స్‌లో చూడటానికి ఆతృతగా ఎదురు చూస్తున్నాను” అంటూ రాసుకొచ్చారు ప్రభాస్. ఈ పోస్ట్ చూసిన ప్రభాస్ అభిమానులు, నాగ అశ్విన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో డైరెక్టర్ ని విష్ చేస్తున్నారు.
Read Also : Koratala Siva : లైన్ లో మరో ఇద్దరు స్టార్ హీరోలు!
ఇక “ప్రాజెక్ట్ కే” విషయానికొస్తే… నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా, దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తుండగా, అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలో కనిపించనున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమా ఇప్పుడు షూటింగ్ దశలో ఉంది. “ప్రాజెక్ట్ కే” కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని అర్రీ అలెక్సా టెక్నాలజీతో తెరకెక్కిస్తుండగా, ఈ అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించిన తొలి భారతీయ చిత్రం “ప్రాజెక్ట్ కే” కానుంది. ఈ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ ను ఆదిత్య 369 ఫేమ్ సింగీతం శ్రీనివాసరావు పర్యవేక్షించనున్నారు. సినిమాటోగ్రాఫర్ డాని శాంచెజ్ లోపెజ్, మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ ఈ మూవీలో భాగమయ్యారు.