Prabhas Skipped Adipurush Pre Release Promotions: మరో రెండు రోజుల్లో ఆదిపురుష్ విడుదల ఉంది. అయితే ఈ సమయంలో సినిమా యూనిట్ సినిమాను గట్టిగా ప్రమోట్ చేస్తుంది అనుకుంటే అసలు చప్పుడే చేయడం లేదు. హనుమంతుడికి సీటు వదిలేయడం, పలువురు సెలబ్రిటీలు పదివేల టికెట్లు కొనుగోలు చేసి పంచుతున్నట్టు ప్రచారం జరగడంతో జనాల్లో అయితే ఈ సినిమా మీద బజ్ ఏర్పడింది. అయితే ఈ టైమ్ లో సినిమాను ప్రమోట్ చేయాల్సిన ప్రభాస్ విదేశాలకు వెళ్లిపోయారు. అమెరికాకు ప్రభాస్ వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. అక్కడ ఆదిపురుష్ విడుదల సందర్భంగా జరిగే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన వెళ్లినట్లు ప్రచారం జరుగుతున్నా ఎలాంటి సమాచారం బయటకు రాకపోవడంతో ఈ విషయం నిజం కాదని అంటున్నారు. ఇక ఈ లెక్కన ఇండియాలో ఆదిపురుష్ కు మరే విధమైన పబ్లిసిటీ లేనట్లే భావించాలి.
Also Read: Tollywood top 10: టాలీవుడ్ లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న టాప్ 10 సినిమాలివే!
ముఖ్యంగా తెలుగులో ఇక వేరే విధమైన ప్రచార కార్యక్రమాలు కూడా ఉండవని అంటున్నారు. నిజానికి అత్యంత భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన తరువాత ఇక పెద్దగా చేయడానికి ఏమీ ఉండదు కానీ యూనిట్ తో కొన్ని ఇంటర్వూలు చేసి పీఆర్ షేర్ చేసి ఉంటే బాగుండేది కానీ అది కూడా జరగలేదు. అయితే సాహో, రాధేశ్యామ్ సినిమాలకు ప్రమోషన్స్ విషయంలో చాలా కష్టపడిన ప్రభాస్ ఈ సినిమా విషయంలో మాత్రం ఎలాంటి ప్రమోషన్స్ లో పాల్గొనడం లేదు. దానికి పెద్ద కారణమే ఉందని అంటున్నారు. అసలు విషయం ఏమిటంటే ఈ సినిమా రాముడి గురించి ఉంది ఈ క్రమంలో ప్రమోషన్స్ లో కొందరు జర్నలిస్టులు వివాదాలకు తావిచ్చేలా ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టొచ్చు, సినిమా రిలీజ్ ముందు ఇలాంటివి ఎందుకులే అని ఆయన లైట్ తీసుకున్నాడని తెలుస్తోంది. అయితే ఇదంతా పక్కన పెడితే ఆదిపురుష్ సినిమా బుకింగ్స్ మాత్రం కాక రేపుతున్నాయి. ఒక రేంజ్ లో ఈ సినిమా బుకింగ్స్ దూసుకు పోతున్నాయి. బుక్ మై షో, ఐనాక్స్ వంటి బుకింగ్ సైట్స్ లో రికార్డులు చెరిపిస్తూ ముందుకు వెళుతున్నాయి.