గత వారం పది రోజులుగా సోషల్ మీడియా టాప్‌లో ట్రెండ్ అవుతున్న ఏకైక పేరు సలార్. ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి మేకర్స్ సైలెంట్‌గా ఉన్నారు కానీ… ఫ్యాన్స్ మాత్రం ఫుల్ కన్ఫ్యుజన్లో ఉన్నారు. సలార్ రిలీజ్ డేట్ విషయంలో ఇంత పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నా కూడా హోంబలే క్లారిటీ ఇవ్వడం లేదు. ఇప్పటికే సెప్టెంబర్ 28 నుంచి సలార్ పోస్ట్‌పోన్ అయినట్టుగా కొన్ని సినిమాలు కన్ఫామ్ చేసేశాయి. సలార్ డ్రాప్ అవడంతో మిగతా సినిమాలు క్యూ కట్టేశాయి. మ్యాడ్, రూల్స్ రంజన్, పెదకాపు లాంటి సినిమాలు సలార్ డేట్‌కు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. అలాగే సెప్టెంబర్ 15న రానున్న స్కంద కూడా 28న వచ్చేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. కాబట్టి.. సలార్ వాయిదా అనేది అనఫిషీయల్గా కన్ఫామ్ అయిపోయింది. మరి సలార్ రిలీజ్ ఎప్పుడు? ఈ ప్రశ్నే ప్రభాస్ ఫ్యాన్స్‌కు నిద్రపట్టకుండా చేస్తోంది. సోషల్ మీడియాలో ఒక్కోరు ఒక్కోలా సలార్ రిలీజ్ డేట్‌ను వైరల్ చేస్తున్నారు.
నవంబర్‌లో ఉంటుంది.. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్లో ఉంటుంది.. అప్పుడు కూడా లేదంటే సంక్రాంతికి సలార్ వచ్చే అవకాశముందని అంటున్నారు. అయితే సలార్ సక్రాంతి బరిలోకి దిగితే మాత్రం కల్కిలో ప్లేస్‌లోకి రావడం గ్యారెంటీ.. అనే బజ్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. వాస్తవానికి కల్కి సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12 రిలీజ్ చేస్తామని ఎప్పుడో అనౌన్స్ చేశాడు నాగ్ అశ్విన్ కానీ ఈ సినిమా సమ్మర్‌కు పోస్ట్‌పోన్ కానుందని చాలా రోజులుగా వినిపిస్తోంది. కాబట్టి.. కల్కి ప్లేస్‌లోకి సలార్‌ను రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అదే నిజమైతే సంక్రాంతి వార్ మామూలుగా ఉండదనే చెప్పాలి. ఇప్పటికే గుంటూరు కారం, ఈగల్ వంటి సినిమాలు సంక్రాంతికి డేట్ లాక్ చేసుకున్నాయి. ఒకవేళ సలార్ గనుక కల్కి ప్లేస్‌లో వస్తే మాత్రం.. మిగతా సినిమాలు డైలమాలో పడినట్టే. మరి ప్రశాంత్ నీల్ ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో చూడాలి.