అది బాహుబలి కావచ్చు.. ట్రిపుల్ ఆర్ కావచ్చు.. కెజియఫ్ కావచ్చు.. లేదంటే ఇంకేదైనా బాలీవుడ్ సినిమా కావచ్చు… ఇప్పటి వరకు ఉన్న ఇండియన్ సినీ రికార్డులన్నీ తిరగరాసేందుకు వస్తోంది సలార్ ఎందుకంటే, హై ఓల్టేజ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ మూవీ పై ఉన్న అంచనాలు.. మరే ఇండియన్ ప్రాజెక్ట్ పై లేవనే చెప్పాలి. ప్రభాస్ లాంటి కటౌట్‌కి ప్రశాంత్ నీల్ ఇచ్చే ఎలివేషన్‌ను చూసేందుకు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇప్పుడా సమయం రానే వస్తోంది. ఇన్ని రోజులు ఆదిపురుష్ డిస్టర్బ్ అవుతుందనే ఆలోచనతో సలార్ అప్డేట్స్‌ని హోల్డ్‌లో పెట్టారు మేకర్స్ కానీ ఇప్పుడు ఆదిపురుష్ రిలీజ్ అయిపోయింది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది కాబట్టి నెక్స్ట్ సలార్‌ను రంగంలోకి దింపేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. సెప్టెంబర్ 28న గ్రాండ్‌గా థియేటర్స్‌లోకి రానుంది సలార్. దాంతో జులై నుంచే సలార్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారట.
అందులో భాగంగా జూన్ 29న సలార్ టీజర్ రిలీజ్ చేసేందుకు టైం ఫిక్స్ చేసినట్టు సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఇప్పటికే ఓ రేంజ్‌లో టీజర్ కట్ చేసినట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే.. మరో పది రోజుల్లో సోషల్ మీడియా తగలబడిపోవడం ఖాయం. అన్ని రికార్డులను సలార్ తుడిచిపెట్టడం గ్యారెంటీ. ఇప్పటి వరకు సలార్ నుంచి మోస్ట్ వైలెంట్ మ్యాన్ అంటూ.. జస్ట్ ఒకటి రెండు ప్రభాస్ పోస్టర్స్ మాత్రమే రిలీజ్ చేశారు. కానీ లీక్డ్ పిక్స్, వీడియోస్ మాత్రం.. సలార్ టీజర్ కోసం ఈగర్‌గా వెయిట్ చేసేలా చేశాయి. అందుకే.. సలార్ నుంచి టీజర్ బయటికి రావడమే లేట్.. రికార్డులు లేస్తాయ్ అని అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. మరి సలార్ టీజర్ అఫీషియల్ అప్డేట్ ఎప్పుడుంటుందో చూడాలి.