డిసెంబర్ 22న రిలీజ్ కానున్న సలార్ సినిమా ట్రైలర్ బయటకి వచ్చినప్పటి నుంచి ఆడియన్స్ లో అంచనాలు విపరీతంగా పెరిగాయి. మూడున్నర నిమిషాల ట్రైలర్ సినిమాపై హైప్ ని ఆకాశం తాకేలా చేసింది అంటే ప్రశాంత్ నీల్ ట్రైలర్ ని ఏ రేంజులో కట్ చేసాడో అర్ధం చేసుకోవచ్చు. ప్రభాస్ ట్రైలర్ లో ఛత్రపతి తర్వాత అంత మాస్ గా కనిపించి ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చాడు. ట్రైలర్ మధ్యలో ప్రభాస్ ని రివీల్ చేసే ముందు పృథ్వీరాజ్ వచ్చి “దేవా” అని పిలుస్తాడు. ఇక్కడి నుంచి ట్రైలర్ లో ప్రభాస్ ర్యాంపేజ్ ఉంటుంది. ఫాస్ట్ కట్స్ తో ట్రైలర్ స్పీడప్ అయ్యి… ప్లీజ్ ఐ కైండ్లి రిక్వెస్ట్ అంటూ ప్రభాస్ డైలాగ్ చెప్పడంతో ట్రైలర్ ఎండ్ అవుతుంది. అయితే పృథ్వీరాజ్ వచ్చి ప్రభాస్ ని దేవా అన్నదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.
సలార్ సినిమా అనౌన్స్మెంట్ సమయంలో “మోస్ట్ వయొలెంట్ మ్యాన్ కాల్డ్ వన్ మ్యాన్ ది మోస్ట్ వయొలెంట్… సలార్” అన్నాడు ప్రశాంత్ నీల్. పెద్ద మీసాలతో, గన్ పట్టుకోని ఉన్న ప్రభాస్ ఫోటో అప్పట్లో పాన్ ఇండియా రేంజులో వైరల్ అయ్యింది. ఇప్పుడు ట్రైలర్ లో దేవాని చూపించారు అంటే సలార్ సీజ్ ఫైర్ లో ఎక్కువశాతం సలార్ కొడుకు దేవా కథనే ఉంటుంది. పార్ట్ 1 ఎండ్ లో కానీ పార్ట్ 2లో కానీ అసలైన వయొలెంట్ మ్యాన్ సలార్ బయటకి వస్తాడు. దేవాకే ర్యాంపేజ్ ఇలా ఉంటే ఇక సలార్ వస్తే బాక్సాఫీస్ కి పూనకాలు వస్తాయేమో. ఆ క్యారెక్టర్ ని ప్రశాంత్ నీల్ ఏ రేంజ్ ఎలివేషన్స్ ఇచ్చి ఉంటాడు అనే దానికి శాంపిల్ గా డిసెంబర్ 22న దేవా వస్తున్నాడు.