పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఇండియన్ బాక్సాఫీస్ పునాదులని కదిలించడానికి సెప్టెంబర్ 28న వస్తున్న సినిమా ‘సలార్ సీజ్ ఫైర్’. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ సినిమాగా పేరు తెచ్చుకున్న సలార్ రిలీజ్ కోసం మూవీ లవర్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ డైనోసర్ ఎప్పుడు రిలీజ్ అయినా బాక్సాఫీస్ దగ్గర నెవర్ బిఫోర్ వసూళ్ల వర్షం కురవడం ఖాయం. అంతటి హైప్ ని మైంటైన్ చేస్తున్న సలార్ సినిమా ఎక్స్పెక్టేషన్స్ ని మరింత పెంచింది టీజర్. మొహం కూడా రివీల్ చేయకుండా టీజర్ కట్ చేస్తే ఆడియన్స్ 24 గంటల్లోనే 83 మిలియన్ వ్యూస్ ఇచ్చారు అంటే సలార్ రేంజ్ అండ్ క్రేజ్ మనం అర్ధం చేసుకోవచ్చు. ప్రశాంత్ నీల్ క్రియేట్ చేసిన మోస్ట్ వయొలెంట్ మ్యాన్ సలార్ ని డైనోసర్ తో పోలుస్తూ బాక్సాఫీస్ లెక్కల వేట గురించి ట్రేడ్ వర్గాలు ఇప్పటి నుంచే ప్రిడిక్షన్స్ స్టార్ట్ చేసాయి.
రిలీజ్ కి ఇంకా నెల రోజులే ఉన్నాయి కాబట్టి ఓవర్సీస్ మార్కెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఫైర్ మోడ్ లో సలార్ ప్రీబుకింగ్స్ జరుగుతున్నాయి, అమెరికాలో అయితే సలార్ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. రిలీజ్ కి ఇంకా సరిగ్గా 31 రోజులు ఉండగానే ఓవర్సీస్ మార్కెట్ లో సలార్ మిలియన్ డాలర్ కలెక్షన్స్ ని రీచ్ అవుతున్నాడు. కేవలం అమెరికాలోనే 500K దగ్గరలో బుకింగ్స్ ఉన్నాయి. ప్రీమియర్స్ దగ్గర పడే కొద్దీ ఈ బుకింగ్స్ మరింత స్పీడప్ అవనున్నాయి. సెప్టెంబర్ 7న సలార్ ట్రైలర్ బయటకి వస్తే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి, హైప్ హిస్టీరియాగా మారుతుంది అప్పుడు బుకింగ్స్ ఏ రేంజులో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాక్ టు బ్యాక్ మూడు ఫ్లాప్స్ ఇచ్చిన తర్వాత కూడా వన్ మిలియన్ డాలర్స్ ప్రీమియర్స్ ని రాబడుతున్నాడు ప్రభాస్.