Project K: సలార్ రూట్లో ప్రాజెక్ట్ K… టైటిల్ తో పాటు ఆ అనౌన్స్మెంట్ కూడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో సలార్, ప్రాజెక్ట్ K పై భారీ అంచనాలున్నాయి. అయితే ఈ రెండు సినిమాలు కూడా బాహుబలి రూట్లోనే వెళ్తున్నాయి. బాహుబలి సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించి పాన్ ఇండియా సినిమాలకు పునాది వేశారు ప్రభాస్, రాజమౌళి. అప్పటి నుంచి పాన్ ఇండియా సినిమాలతో పాటు… సీక్వెల్ సినిమాలు కూడా ఎక్కువైపోయాయి. బాహుబలి తర్వాత వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన కెజియఫ్ కూడా రెండు భాగాలుగా రిలీజ్ అయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప కూడా టు పార్ట్స్‌గానే వస్తోంది. ప్రజెంట్ పుష్ప2 సెట్స్ పై ఉంది. మణిరత్నం కూడా పొన్నియన్ సెల్వన్‌ను రెండు భాగాలుగా ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చాడు. ఇక ఇప్పుడు ప్రభాస్ రెండు సినిమాలతో వరుసగా రెండు భాగాలతో రాబోతున్నాడు.
ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ మూవీని టు పార్ట్స్‌గా చేస్తున్నట్టు.. రీసెంట్గా రిలీజ్ చేసిన సలార్ టీజర్‌తో చెప్పేశారు. ఫస్ట్ పార్ట్ ‘సలార్ పార్ట్ 1.. సీజ్ ఫైర్’ పేరుతో రాబోతోంది. సెప్టెంబర్ 28న సలార్1 రిలీజ్ కానుంది. వచ్చే సమ్మర్లో సలార్ 2 రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇక సలార్ తర్వాత పాన్ వరల్డ్ రేంజ్లో రాబోతోంది ప్రాజెక్ట్ కె. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కూడా రెండు భాగాలుగా రాబోతోందట. చాలా రోజులుగా ఈ న్యూస్ వినిపిస్తున్నప్పటికీ, ఇప్పుడు ప్రాజెక్ట్ కె మేకర్స్ టు పార్ట్స్‌గా ఫిక్స్ అయిపోయారని తెలుస్తోంది. జూలై 20న ప్రాజెక్ట్ కె టైటిల్ అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. అదే రోజు రెండు భాగాలుగా ప్రకటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఫస్ట్ పార్ట్‌లో కమల్ హాసన్ క్యారెక్టర్‌కు లీడ్ ఇస్తూ.. సెకండ్ పార్ట్‌లో ప్రభాస్ వర్సెస్ కమల్ వార్ ఓ రేంజ్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఇదే నిజమైతే మూడు సినిమాలు, రెండు భాగాలుగా చేసిన హీరోగా ప్రభాస్ నిలవనున్నాడని చెప్పొచ్చు.
Also Read
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
- Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
- Anirudh Ravichander: రామ్ చరణ్ - సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
తాజావార్తలు
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!