Save The Tigers Season 3: ఆ ముగ్గురు మొగుళ్ల పంచాయితీలోకి ‘వెన్నెల కిషోర్’.. ‘సేవ్ ది టైగర్స్ 3’ లో నెక్స్ట్ లెవెల్ ఫన్ లోడింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Save The Tigers Season 3: తెలుగు ఓటీటీ స్పేస్‌లోనే బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలిచిన ‘సేవ్ ది టైగర్స్’ ఇప్పుడు సీజన్ 3తో రచ్చ చేయడానికి సిద్ధమైంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి, ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్న మోస్ట్ సక్సెస్ఫుల్ వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. భార్యల బాధితులైన ముగ్గురు భర్తల కథతో వచ్చిన సీజన్ 1, సీజన్ 2లు తెలుగు ఓటీటీ చరిత్రలోనే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌గా నిలిచి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను రిపీట్ చేస్తూ, మరింత డబుల్ డోస్ ఫన్‌తో ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ రాబోతోంది. తాజాగా ఈ క్రేజీ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ ప్రముఖ క్రియేటర్స్ మహి వి.రాఘవ్, ప్రదీప్ అద్వైతం షో రన్నర్స్‌గా వ్యవహరిస్తున్న ఈ సరికొత్త సీజన్ జియో హాట్‌స్టార్ వేదికగా జూన్ 19వ (save the tigers 3 release date ott) తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈసారి వెన్నెల కిషోర్ ఎంట్రీ ఇవ్వడం, కాస్మిక్ ట్విస్ట్‌తో సరికొత్త కథతో వస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి.
తాజాగా విడుదలైన సీజన్ 3 ట్రైలర్‌ను చూస్తే.. ఈసారి దర్శకుడు శ్రీరామ్ ఎరగం కథను సరికొత్త పంథాలో నడిపించబోతున్నట్లు అర్థం అవుతుంది. ఈ సీజన్లో ఒక ఆసక్తికరమైన ‘కాస్మిక్ ట్విస్ట్’ కథలోకి వచ్చి, రెండు వైవిధ్యమైన ప్రపంచాల మధ్య జరిగే ఒక ప్రత్యేకమైన సోషల్ ఎక్స్‌పెరిమెంట్‌లా ఈ కథ సాగనుందని అర్థం అవుతుంది. మొదటి రెండు సీజన్లలో తమ అద్భుతమైన టైమింగ్‌తో పొట్టచెక్కలయ్యేలా నవ్వించిన పాత జంటలు ఈసారి కూడా ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. ప్రియదర్శి – జోర్దార్ సుజాత, అభినవ్ గోమటం – పావని గంగిరెడ్డి, కృష్ణ చైతన్య – దేవియాని శర్మల కెమిస్ట్రీ ఈ సీజన్‌కు కూడా మెయిన్ పిల్లర్ కానుంది. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్లో ‘‘ఎవడ్రా చెప్పింది ‘పెళ్లంటే పండు వెన్నెల.. పెళ్లామంటే నిండు పున్నమి’’ అంటూ పలికిన డైలాగ్స్ వినోదాన్ని పంచాయి. ఈ సీజన్ 3లో బిగ్గెస్ట్ సర్ప్రైజ్గా .. స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ ఎంట్రీ ఇవ్వడం నిలిచింది. ఈ సీజన్లో ఇంద్రుడిగా వెన్నెల కిషోర్ కనిపించబోతున్నారు. ముగ్గురు మొగుళ్ల పంచాయితీలోకి వచ్చిన ‘వెన్నెల కిషోర్’.. ఆ టైగర్స్‌ను వారి భార్యల నుంచి ఎలా సేవ్ చేశాడో చూడాల్సిందే.
Also Read
తాజావార్తలు
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!