Mumbai Indians: ఆటగాళ్లకు ముంబై మేనేజ్మెంట్ లాస్ట్ వార్నింగ్.. ఫ్రాంచైజీతో ఆడుకుంటే ఇకపై తరిమి కొట్టడమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ మోస్ట్ సక్సెస్ఫుల్ జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్ (MI) జట్టులో అంతర్గత విబేధాలు ముదిరిపాకాన పడ్డాయి. ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాను జట్టు నుండి తప్పించడం ఇక కేవలం కాలం నిర్ణయించాల్సిన విషయమేనని తెలుస్తోంది. గుజరాత్ టైటాన్స్ నుండి భారీ ట్రేడింగ్ ఒప్పందం ద్వారా ముంబై జట్టులోకి తిరిగి వచ్చిన హార్దిక్ పాండ్యాకు యాజమాన్యం కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మను కాదని హార్దిక్‌కు నాయకత్వం ఇవ్వడం అప్పట్లో సంచలనంగా మారింది. అయితే, హార్దిక్ రీ-ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి ముంబై డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం పూర్తిగా మారిపోయిందని, అక్కడ తీవ్రమైన ‘చేదు అనుభవాలు’, విభేదాలు నెలకొన్నాయని నివేదికలు చెబుతున్నాయి.
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. హార్దిక్ జట్టులోకి వచ్చినప్పటి నుండి డ్రెస్సింగ్ రూమ్‌కు సంబంధించిన అంతర్గత విషయాలు, రహస్యాలు నిరంతరం బయటకు పొక్కడంపై ముంబై మేనేజ్మెంట్ తీవ్ర అసంతృప్తితో ఉంది. సాధారణంగా ప్రతి జట్టులోనూ చిన్న చిన్న భేదాభిప్రాయాలు సహజమే అయినప్పటికీ, ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రస్తుతం ఉన్న గ్రూపు రాజకీయాలు, అసంతృప్తి మునుపెన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరాయని ఒక అధికారి పేర్కొన్నారు. ఎంతోమంది దిగ్గజాలు, కెప్టెన్సీ మార్పులను చూసిన ఈ ఫ్రాంచైజీలో ఇలాంటి దుస్థితి ఎప్పుడూ రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
మైదానంలో ఆటగాళ్ల బాడీ లాంగ్వేజ్, కొందరు ప్లేయర్లు సోషల్ మీడియాలో పెట్టిన వివాదాస్పద ఎమోజీల వ్యవహారం జట్టులోని చీలికను స్పష్టం చేస్తోంది. ఆటగాళ్లు కేవలం అటెండెన్స్ వేయడానికే వస్తున్నట్లు కనిపిస్తోందని, జట్టు ప్రయోజనాల కంటే సొంత ప్రాధాన్యతలే ఎక్కువయ్యాయని యాజమాన్యం భావిస్తోంది. ఈ నేపథ్యంలో, డ్రెస్సింగ్ రూమ్ విషయాలను బయటకు లీక్ చేసే వారిపై ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అవలంబించాలని ముంబై మేనేజ్మెంట్ గట్టి నిర్ణయం తీసుకుంది. ఫ్రాంచైజీని తక్కువ అంచనా వేసి, ఆటతో ఆడుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని ప్లేయర్లకు గట్టి హెచ్చరికలు జారీ చేసేందుకు సిద్ధమవుతోంది.
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?