నెక్స్ట్ సమ్మర్‌లో రానున్న పాన్ ఇండియా సినిమాల్లో కల్కి ఒక్కటే పెద్ద సినిమా. సలార్ వంటి హిట్ తర్వాత ప్రభాస్ నుంచి ఆరు నెలల గ్యాప్‌లో వస్తున్న కల్కి పై భారీ అంచనాలున్నాయి. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటిస్తుండగా… కమల్ హసన్ విలన్‌గా నటిస్తున్నాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో కల్కి మూవీని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. త్వరలోనే ప్రభాస్ కల్కి సెట్స్‌లోకి జాయిన్ కానున్నాడు. మే 9న కల్కి 2898 ఏడి రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే కల్కి ప్రమోషన్స్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే… కల్కికి సంబందించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ముందు నుంచి ఈ సినిమా పురాణాలను టచ్ చేస్తూ తెరకెక్కుతోందని వినిపిస్తోంది. ప్రభాస్ కల్కి అవతారంలో కనిపించనున్నాడు కానీ ఇప్పుడు మాత్రం ప్రభాస్ ఏకంగా ఐదు విభిన్న పాత్రలో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. శ్రీమహావిష్ణువు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, బుద్ధుడు, కల్కి… ఇలా ఐదు పాత్రల్లో ప్రభాస్ కనిపించనున్నట్లుగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అందుకు సంబంధించిన ప్రభాస్ ఏఐ టెక్నాలజీ ఫోటోలు కూడా నెట్టింట్లో దర్శనమిస్తున్నాయి. అలాగే ఈ సినిమాని ఏకంగా మూడు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లుగా రూమర్స్ వస్తున్నాయి. మొదటి భాగం ‘కల్కి 2898 AD’ కాగా రెండో భాగం ‘కల్కి 3102 BC’ అనే పేరుతో రానుందని అంటున్నారు. అంతేకాదు… రెండో భాగాన్ని 2027లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. మరి ఇలాంటి విషయల్లో క్లారిటీ రావాలంటే… ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.