Unstoppable 2:హమ్మయ్య.. ఎట్టకేలకు బాహుబలి.. బాలయ్య సెట్ కు చేరుకున్నాడు. ఎవరు ఎన్ని చెప్పినా ఈ కాంబో సెట్స్ మీదకు వెళ్తుందా..? లేదా అనే అనుమానం మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ లో ఇప్పటివరకు ఉంది. అన్ స్టాపబుల్ షో కు ప్రభాస్ వస్తున్నాడు అనగానే డార్లింగ్ వస్తాడా..? రాడా..? అనే డౌట్.. వస్తే ఎప్పుడు అవే లూజ్ షర్ట్ లు.. నల్ల క్యాప్ లు వీటితో వస్తాడా..? అనే అనుమానం.. ప్రభాస్ ఫ్యాన్స్ ను వెంటాడుతోంది. ఇక ఈ సెట్ నుంచి లీక్ అయిన ఒకే ఒక పిక్ తో ఆ అనుమానాలు పటాపంచలయ్యాయి.
ఎట్టకేలకు బాలయ్య షో లో ప్రభాస్ సందడి మొదలయ్యింది. అల్ట్రా స్టైలిష్ లుక్ లో ప్రభాస్ కనిపించాడు.. తీరైన హెయిర్ కట్, ఎల్లో కలర్ చెక్స్ షర్ట్ లో ప్రభాస్ పక్కా జెంటిల్ మ్యాన్ లా కనిపిస్తున్నాడు. ఇక ఈ ఫోటో చూసాక చాలు స్వామి.. ఇంతకన్నా మేము ఏమి కోరుకోవడం లేదు అని ప్రభాస్ ఫ్యాన్స్ ముచ్చటపడుతున్నారు. ఇక మరోపక్క బాలయ్య, ప్రభాస్ ను ఎలాంటి ప్రశ్నలు అడిగాడు.. ప్రభాస్ తడబడకుండా సమాధానాలు చెప్పాడా..? అనేది ఆసక్తిగా మారింది. దీంతో ఎప్పుడెప్పుడు ఈ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేస్తారా..? అని అభిమానులు ఆరాటపడుతున్నారు.