Prabhas invited to Ayodhya Ram Mandir Pran Pratishtha: అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం జనవరి 22, 2024న జరగనుంది. ఈ వేడుక కోసం దేశంలో భిన్న రంగాలకు చెందిన ప్రతిభావంతులను హాజరు కమ్మని కోరుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ వేడుక కోసం రణబీర్ కపూర్, అలియా భట్, అక్షయ్ కుమార్‌లతో పాటూ తెలుగు నుంచి చిరంజీబీవీతో పాటు ప్రభాస్ ను సైతం ఆహ్వానించినట్లు పింక్‌విల్లా ఒక రిపోర్టులో పేర్కొంది. సన్నీ డియోల్, అజయ్ దేవ్‌గన్, ఆయుష్మాన్ ఖురానా, టైగర్ ష్రాఫ్ – యష్ లు కూడా ఈ ఈవెంట్‌కు హాజరుకానున్నారు. అదే విధంగా సంజయ్ లీలా భన్సాలీ, రోహిత్ శెట్టి, రాజ్‌కుమార్ హిరానీ సహా ఇంకా చాలా మందిని ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కంగనా రనౌత్ రామజన్మభూమి దర్శనం కోసం అయోధ్యలోని రామమందిరాన్ని సందర్శించారు.
Sriya Reddy: అదే జరిగితే ఓజీ చేశాక సినిమాలు ఆపేస్తా.. శ్రీయా రెడ్డి షాకింగ్ కామెంట్స్
ఇక, అయోధ్యలో రామమందిరం నిర్మాణం పూర్తయ్యే దశలో ఉందని, ఆలయ సంప్రోక్షణకు ఆహ్వానం అందడం తనకు గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అన్నారు. తాజాగా జగద్గురు రామభద్రాచార్య తులసి పీఠంలో జరిగిన బహిరంగ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, “వెయ్యి సంవత్సరాల బానిసత్వంలో, భారతదేశాన్ని వివిధ మార్గాల్లో నిర్మూలించడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి” – వాటిలో ఒకటి “సంస్కృతాన్ని పూర్తిగా నాశనం చేయడం” అని అన్నారు. నిజానికి రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానించబడే సాధువులు మరియు VVIPలతో సహా సుమారు 6000 మంది ప్రముఖుల జాబితాను ట్రస్ట్ ఈ నెల మొదట్లోనే ఖరారు చేసింది. ఇక మూడు గంటల ఈ కార్యక్రమం ఉదయం 11 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 2 గంటలకు ముగుస్తుంది, ప్రధానమంత్రి వేదిక నుండి బయలుదేరిన తర్వాత మాత్రమే ఇతరులను బయలుదేరడానికి అనుమతిస్తారు.