Sriya Reddy says she will retire after OG if its satisfactory: తెలుగులో హీరోయిన్ గా లాంచ్ అయినా తమిళంలో కొన్ని సినిమాలతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రియ రెడ్డి ఆ తర్వాత విశాల్ సోదరుడు విక్రమ్ ని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమై ఫ్యామిలీ ఉమెన్ అయింది. చంద్ర సిద్ధార్థ దర్శకత్వంలో రాజా హీరోగా 2003లో వచ్చిన ‘అప్పుడప్పుడు’ అనే సినిమాతో శ్రియ రెడ్డి హీరోయిన్ అయింది కానీ ఆ సినిమా సరైన రిజల్ట్ అందుకోక పోవడంతో తమిళం వైపు చూసింది. తమిళంలో పలు సినిమాలు చేసినా పొగరు అనే సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. ఇక సినిమాలకు దూరమైపోయిన ఆమె మళ్లీ మొన్నీమధ్య సుడల్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగ రిలీజ్ అయిన పాన్ ఇండియా మూవీ సలార్ లో శ్రీయ రెడ్డి జగపతిబాబు కూతురుగా ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి ఆమె నటనకు గాను మంచి మార్కులు కొట్టేసింది.
Namratha-Upasana: పార్టీలో చిల్ అయిన నమ్రత-ఉపాసన… మహేష్, చరణ్ మిస్సింగ్?
అంతేకాదు సలార్ రెండో భాగంలో ఈమెకు మరింత ఇంపార్టెన్స్ ఉండబోతోందని అంటున్నారు. సలార్ తర్వాత శ్రియా రెడ్డి చేస్తున్న మరో తెలుగు సినిమా ‘ఓజి’, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాలో డైరెక్టర్ సుజీత్ తనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర ఇచ్చాడని ఆమె అంటోంది. ఇక తాజాగా మీడియాతో ముచ్చటించిన ఆమె తనకు కావాల్సిన హై మూమెంట్ పొగరు సినిమాతో రావడం వలన తాను సినిమాలు ఇక వద్దు అనుకున్నానని ఆమె చెప్పుకొచ్చింది. ఇప్పుడు అదే రిపీట్ అవుతూ సలార్ మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చిందని ఆమె అన్నారు. ఓజీ కూడా అంతకు మించి ఉంటుందని, ఇక చాలు అని తనకు అనిపిస్తే ఆ సినిమా తరువాత సినిమాలకు రైటర్ మెంట్ కూడా ప్రకటిస్తా అని ఆమె చెప్పుకొచ్చింది.