పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా దర్శకుడు రాధా కృష్ణ దర్శకత్వంలో వస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధే శ్యామ్”. ఈ చిత్రం 11 మార్చి 2022న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘రాధేశ్యామ్’ ప్రమోషన్లను వేగవంతం చేశారు. ముఖ్యంగా ప్రభాస్, పూజా కలిసి ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. సినిమా తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ, తమిళ భాషల్లో విడుదల కానుండడంతో అన్ని చోట్లా ప్రమోషన్ కార్యక్రాలకు ప్లాన్ చేశారు. అందులో భాగంగా శుక్రవారం ‘రాధేశ్యామ్’ ప్రమోషన్ల కోసం చెన్నైకి వెళ్లింది టీం. చెన్నైలో పుట్టి పెరిగిన ప్రభాస్ తన అనర్గళమైన తమిళంతో ఈరోజు విలేకరులను కూడా ఆకట్టుకున్నాడు. ప్రెస్ మీట్‌లో అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు.
Read Also : Bheemla Nayak : పవన్ కు డబ్బింగ్ చెప్పింది ఎవరో తెలుసా ?
అయితే ఒక రిపోర్టర్ అడిగిన ఒక ప్రశ్నకు ప్రభాస్ ఫన్నీ ఆన్సర్ ఇచ్చారు. విలేఖరి “రాధే శ్యామ్” క్లైమాక్స్ గురించి ప్రశ్నించాడు. “సార్ క్లైమాక్స్ లో లవ్ గెలుస్తుందా లేక డెస్టినీ గెలుస్తుందా?” అని అడిగాడు. దీంతో ప్రభాస్ స్పందిస్తూ “అది నేను ఎలా చెప్తా సార్. కనీసం 50 రూపాయల టిక్కెట్ అన్నా కొని సినిమా చూడండి” అంటూ పంచ్ వేశారు ఫన్నీగా. ఇక అందరూ నవ్వుతుండగానే సినిమా నిర్మాణ బడ్జెట్ రూ. 300 కోట్లు అని, “ఇప్పుడు నేను క్లైమాక్స్ మీకు చెప్తే నన్ను చంపేస్తారు సార్” అంటూ చెప్పుకొచ్చాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.