ఈ జనరేషన్ ఆడియన్స్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసాడు ప్రభాస్. బాహుబలి సినిమాతో రీజనల్ బారియర్స్ కి క్లోజ్ చేసి కొత్త మార్కెట్ ని ఓపెన్ చేసాడు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్ని రీజన్స్ అయినా ఉండొచ్చు కానీ అన్ని రీజన్స్ కి కలిపి ఒకడే కింగ్ ఉంటే అతను ప్రభాస్ మాత్రమే. ఇలాంటి కింగ్ మరోసారి బాక్సాఫీస్ పై దండయాత్ర చేయడానికి సలార్ సినిమాతో థియేటర్స్ లోకి వచ్చేసాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమా సేల్స్ కూడా దాటేస్తూ కొత్త బెంచ్ మార్కులని సెట్ చేస్తున్నాడు. హైదరాబాద్ రీజన్ లో అడ్వాన్స్ సేల్స్ గ్రాస్ విషయంలో ఆదిపురుష్ సినిమా 9.5 కోట్లు, ఆర్ ఆర్ ఆర్ సినిమా 10.5 కోట్లు రాబట్టాయి.
Read Also: Salaar Review: ప్రభాస్ ‘సలార్’ మూవీ రివ్యూ!
ఆర్ ఆర్ ఆర్ సినిమా అడ్వాన్స్ గ్రాస్ ఇప్పట్లో బ్రేక్ అవ్వదేమో అనుకున్నారు కానీ ప్రభాస్ ఈ కలెక్షన్స్ ని బ్రేక్ చేసాడు. హైదరాబాద్ అడ్వాన్స్ సేల్స్ విషయంలో సలార్ 12.2 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రభాస్ ని నైజాం కింగ్ అంటారు, ఆ మాటని నిజం చేస్తున్నాడు ప్రభాస్. ప్రశాంత్ నీల్-ప్రభాస్ లు కలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ అవుతుందో, దాన్ని ప్రూవ్ చేస్తుంది సలార్ సినిమా. ఈ జోష్ మరింత పెరగడం గ్యారెంటీ, టాక్ బాగుంది కాబట్టి సలార్ ర్యాంపేజ్ మాములుగా ఉండదు. అన్నీ అనుకున్నట్లు జరిగితే సలార్ సినిమా 2023 ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ గా నిలబడం గ్యారెంటీ.
Read Also: Salaar: దాదాపు ఆరేళ్ల తర్వాత ఆ రికార్డుని బ్రేక్ చేసిన ప్రభాస్…