ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సలార్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర మాస్ జాతర చేయించింది. నీల్ మావా ఎలివేషన్‌కు ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. బాక్సాఫీస్ దగ్గర 750 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన సలార్… ప్రస్తుతం ఓటిటిలోను సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీంతో సలార్ సీక్వెల్ అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. సలార్ సీక్వెల్‌లో పార్ట్ 2 టైటిల్ శౌర్యాంగ పర్వం అని అనౌన్స్ చేశాడు ప్రశాంత్ నీల్. ఫస్ట్ పార్ట్‌ను జస్ట్ శాంపిల్‌గా చూపించిన ప్రశాంత్ నీల్.. అసలు కథ మొత్తం సెకండ్ పార్ట్‌లో ఉందని చెప్పేశాడు. శౌర్యాంగ పర్వాన్ని అంతకుమించి అనేలా ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. అయితే… ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.
వాస్తవానికైతే ఈ సమ్మర్‌లో ఎన్టీఆర్ 31ని సెట్స్ పైకి తీసుకెళ్లాని ప్లాన్ చేశాడు ప్రశాంత్ నీల్ కానీ దేవర, వార్ 2 వల్ల ఎన్టీఆర్ 31 వెనక్కి వెళ్లే ఛాన్స్ ఉంది. ఈలోపు సలార్ 2 కంప్లీట్ చేసి 2025లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ప్రస్తుతం సలార్ సీక్వెల్ గురించి చర్చలు జరుగుతున్నాయి. నవంబర్ నుంచి షూటింగ్ ఉంటుందని టాక్ రాగా… లేటెస్ట్ అప్డేట్ మాత్రం మరింత ముందుకొచ్చిందని చెబుతోంది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే సమ్మర్ నుంచే సలార్ 2 సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. సలార్ కోసం వేసిన సెట్స్ అన్నీ దాదాపుగా అలానే ఉంచడంతో పార్ట్ 2 షూటింగ్ కోసం ప్రత్యేకించి మళ్లీ సెట్ వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ డిలే అయితే సెట్స్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది… కొత్త సెట్స్ వేయాలంటే ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి త్వరగా షూటింగ్ స్టార్ట్ చేస్తే ఇప్పటికే ఉన్న సెట్స్ లోనే షూటింగ్ చేసేయొచ్చు అనేది మేకర్స్ ప్లాన్ కూడా. మరి ఈసారి ప్రభాస్, ప్రశాంత్ నీల్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.