Unstoppable 2: రేపే ‘అన్‌స్టాపబుల్’లో ప్రభాస్-గోపీచంద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Unstoppable 2: నటసింహ నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తోన్న ‘అన్ స్టాపబుల్’ రెండో సీజన్ సైతం జనాన్ని విశేషంగా అలరిస్తోంది. ఈ సీజన్‌లోనూ పలువురు సెలబ్రిటీస్‌తో బాలయ్య చేసిన సందడి భలే వినోదం పంచింది. రాబోయే ఎపిసోడ్లలోనూ అదే తీరున సాగనుందని తెలుస్తోంది. ‘బాహుబలి’ స్టార్ ప్రభాస్‌తో బాలయ్య ‘అన్ స్టాపబుల్’ కార్యక్రమం డిసెంబర్ 11న చిత్రీకరణ జరుపుకోనుంది. ఈ ఎపిసోడ్ శుక్రవారం అంటే డిసెంబర్ 16న ప్రసారం కానుంది. ప్రభాస్‌తో సాగే అన్ స్టాపబుల్ ఎపిసోడ్‌లో యంగ్ రెబల్ స్టార్‌కు మంచి మిత్రుడైన మరో స్టార్ గోపీచంద్ కూడా మధ్యలో జాయిన్ కానున్నారు.
Read Also: Unstoppable: సన్నీతో ‘అన్ స్టాపబుల్’ అంటున్న డైమండ్ రత్నబాబు!
Also Read
ఇదిలా ఉంటే ఒకప్పుడు తెలుగునేలను విశేషంగా అలరించి.. ఆ తరువాత రాజకీయాల్లోనూ తమదైన బాణీ పలికించిన ‘జయ’ద్వయం – జయప్రద, జయసుధతోనూ బాలయ్య ‘అన్ స్టాపబుల్’ సాగనుంది. ప్రభాస్ ఎపిసోడ్ తరువాత జయప్రద, జయసుధతో ఎపిసోడ్ రూపొందనున్నట్టు సమాచారం. ఒకప్పుడు ఎన్టీఆర్‌కు హిట్ పెయిర్స్‌గా నిలిచిన జయప్రద, జయసుధ ఇద్దరితోనూ బాలకృష్ణ నటించారు. అయితే వీరిలో జయసుధ ఒక్కరే ‘అధినాయకుడు’లో ఆయనకు జోడీగా కనిపించారు. బాలకృష్ణ ‘మహారథి’లో ఆయనకు అత్త పాత్రలో జయప్రద కనిపించారు. మరో విశేషమేమంటే.. ఈ ఇద్దరు నాయికలు ఎన్టీఆర్ దర్శకత్వంలో ‘శ్రీతిరుపతి వేంకటేశ్వర కళ్యాణం’లో నటించారు. అందులో ఇద్దరితోనూ నారదుని పాత్ర దరించిన బాలయ్యకు సన్నివేశాలు ఉన్నాయి. నిజానికి ఈ ‘జయ’ద్వయం బాలయ్య వర్ధమాన నటునిగా ఉన్న సమయంలోనే ఆయనతో జోడీ కట్టాల్సి ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల అది కుదరలేదు. ఇలాంటి ముచ్చట్లన్నీ ఆ ఎపిసోడ్‌లో చోటు చేసుకోనున్నాయని తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రభాస్‌తో ‘అన్ స్టాపబుల్’ ఎపిసోడ్ నవతరం వారికి ఖచ్చితంగా కన్నులపండుగే. ఆనాటి జయప్రద, జయసుధ అభిమానులకు వారి ఎపిసోడ్ కూడా నయనానందం కలిగిస్తుందని చెప్పవచ్చు.
తాజావార్తలు
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!