Prabhas: ట్రిబెకా ఫెస్టివల్ లో ఆదిపురుష్… ఇంటర్నేషనల్ లెవల్ కి ఇండియన్ సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ సినిమా బౌండరీలని మొదటిసారి దాటించిన సినిమా ‘బాహుబలి’. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాతో ప్రభాస్ ఈ జనరేషన్ చూసిన మొదటి పాన్ ఇండియా హీరో అయ్యాడు. బాహుబలి 2 సినిమా లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ప్రదర్శితం అయ్యింది. ఒక ఇండియన్ సినిమా ఆల్బర్ట్ హాల్ లో ప్రిమియర్ అవ్వడం అదే మొదటిసారి. ఇప్పుడు మరోసారి ఇండియన్ సినిమా బౌండరీలని దాటిస్తూ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆదిపురుష్’ మూవీ ‘ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్’ లో స్క్రీనింగ్ చెయ్యనున్నారు. ప్రభాస్ హీరోగా ‘టి సిరీస్ ఫిలిమ్స్’ 550 కోట్ల బడ్జట్ తో భారీ స్థాయిలో ప్రొడ్యూస్ చేస్తున్న మైథలాజికల్ జానర్ మూవీ ‘ఆదిపురుష్’. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదత్త నాగే హనుమంతుడిగా, సైఫ్ ఆలీ ఖాన్ రావణాసురుడిగా నటిస్తున్న ఆదిపురుష్ సినిమాపై ప్రభాస్ ఫాన్స్ లో హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.
ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ జూన్ 16న ప్రపంచవ్యాప్త సినీ అభిమానుల ముందుకి రావడానికి రెడీ అయ్యింది. రిలీజ్ కన్నా ముందే స్పెషల్ స్క్రీనింగ్ కి రెడీ అయ్యింది ఆదిపురుష్ మూవీ. జూన్ 13న అమెరికాలోని న్యూయార్క్ లో జూన్ 7 నుండి 18 వరకూ జరిగే ట్రిబెకా ఫెస్టివల్ లో ఆదిపురుష్ సినిమా స్పెషల్ ప్రీమియర్ గా ప్రదర్శించనున్నారు. ఒక ఇండియన్ సినిమా ట్రిబెకా ఫెస్టివల్ లో స్క్రీనింగ్ అవ్వడం ఇదే మొదటిసారి. గతంలో బాహుబలి సినిమాతో ఇండియాన్స్ సినిమా ప్రైడ్ ని రాయల్ ఆల్బర్ట్ హాల్ వరకూ తీసుకోని వెళ్లడంలో భాగమైన ప్రభాస్, ఇప్పుడు ఆదిపురుష్ సినిమాలో కూడా భాగం అవ్వడం విశేషం. టీజర్ రిలీజ్ అయిన సమయంలో ఆదిపురుష్ సినిమాపై నెగటివ్ కామెంట్స్ వినిపించాయి. ఆ కామెంట్స్ ని కాంప్లిమెంట్స్ గా మార్చుకుంటూ ఆదిపురుష్ సినిమా రోజురోజుకీ పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేస్తోంది. మరి జూన్ 16న ఆడియన్స్ ని ఎంతగా మెప్పిస్తుందో చూడాలి.
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
Beyond Excited and Honored! Adipurush, the epic saga of courage and devotion, is set to make its world premiere at the prestigious #TribecaFestival on the 13th of June in New York. pic.twitter.com/bUiKWR6H4b
— Om Raut (@omraut) April 18, 2023
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!