Dorothy : ఎన్నాళ్లకు.. కొత్త సినిమా ప్రకటించిన కోలివుడ్ స్టార్ డైరెక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ దర్శకులలో ఒకరు కార్తీక్ సుబ్బరాజ్. రొటీన్ రెగ్యులర్ కథలతో కాకుండా కాస్త డిఫరెంట్ స్టోరీస్ తో వైవిధ్యభరిత దర్శకుడిగా కార్తీక్ సుబ్బరాజ్సెపరేట్ మార్క్ క్రియేట్ చేసాడు. అలా సూపర్ స్టార్ రజనీకాంత్ తో పేట, సూర్యతో రెట్రో సినిమాలకు డైరెక్టర్ గా ఛాన్స్ అందుకున్నాడు. కానీ రెండు సినిమాలు యావరేజ్ రిజల్ట్ తెచ్చుకోవడంతో కార్తీక్ సుబ్బరాజ్ కు స్టార్ హీరోలు అవకాశం ఇచ్చేందుకు వెనుకాముందు ఆలోచిస్తున్నారు. దాదాపు ఏడాదిగా స్టార్ హీరోల చుట్టూ తిరిగినా ఉపయోగం లేకుండడంతో కాస్త గ్యాప్ తీసుకుని తన 10వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి ‘డోరతి‘ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. తన కెరీర్లో ఎంతో ప్రత్యేకమైనదిగా భావిస్తున్న ఈ కథను ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత తెరకెక్కించినట్లు దర్శకుడు తెలిపారు.
ఈ చిత్రంలో జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, సనంత్, రిషి కాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరో విశేషమేమిటంటే ఈ సినిమాకు సంగీత బ్రహ్మ ఇళయరాజా స్వరాలు అందిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాతో కలసి పనిచేయడం తన కల నిజమైనట్లే అని కార్తీక్ సుబ్బరాజ్ ఆనందం వ్యక్తం చేశారు. రిలీజ్‌కు ముందే ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించింది. ప్రతిష్టాత్మక టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘డోరతి’ చిత్రం వరల్డ్ ప్రిమియర్‌గా ఎంపికైంది. ఈ విశేషంతో పాటు, సెప్టెంబర్ 25న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
Also Read
- Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
- Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
- Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
- Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
తాజావార్తలు
-
BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
-
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
-
Shubman Gill: అదే మా కొంపముంచింది.. ప్రపంచ కప్‌కు ముందు ఇలా ఆడితే..!
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!