ఇండియన్ సినిమా బౌండరీలని మొదటిసారి దాటించిన సినిమా ‘బాహుబలి’. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాతో ప్రభాస్ ఈ జనరేషన్ చూసిన మొదటి పాన్ ఇండియా హీరో అయ్యాడు. బాహుబలి 2 సినిమా లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ప్రదర్శితం అయ్యింది. ఒక ఇండియన్ సినిమా ఆల్బర్ట్ హాల్ లో ప్రిమియర్ అవ్వడం అదే మొదటిసారి. ఇప్పుడు మరోసారి ఇండియన్ సినిమా బౌండరీలని దాటిస్తూ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆదిపురుష్’ మూవీ…