యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నెక్స్ట్ మూవీ Adipurushపై అందరి దృష్టి ఉంది. ఇటీవలే “రాధేశ్యామ్” అనే పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనర్ తో థియేటర్లలోకి వచ్చిన డార్లింగ్ అంచనాలను అందుకోలేకపోయాడు. అయితే ఇప్పుడు ఆ సినిమా ఫలితాన్ని పక్కన పెట్టి ప్రభాస్ తరువాత సినిమాలు, వాటి అప్డేట్స్ గురించి ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ తరువాత చేయనున్న వరుస సినిమాలలో “ఆదిపురుష్” సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ మెయిన్ విలన్‌గా నటించారు. కృతి సనన్ సీతగా కనిపించబోతోంది. తాజా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఏప్రిల్ 10న విడుదల కానుంది.
Read Also : Attack Challenge : బాలీవుడ్ హీరోకు అదిరిపోయే వీడియోతో సామ్ రిప్లై
అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా Adipurush ఫస్ట్ లుక్ పై అందరి దృష్టి ఎందుకు మళ్ళిందంటే… ఏప్రిల్ 10న హిందువులంతా పవిత్రంగా భావించే శ్రీరామ నవమి పండగను సెలెబ్రేట్ చేసుకోనున్నారు. ఇక “ఆదిపురుష్” ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందుతున్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఇప్పుడు అందరూ “ఆదిపురుష్”పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతోంది. మరి అందరూ ఆశించినట్టుగా Adipurush ఫస్ట్ లుక్ ఏప్రిల్ 10న శ్రీరామ నవమి స్పెషల్ గా విడుదలవుతుందా ? అనేది చూడాలి.