Unstoppable with NBK: ఆహాలో ప్రసారం అవుతున్న ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె.’ షో సెకండ్ సీజన్ ఇటీవలే మొదలైంది. ఈ షో సెకండ్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ఆదివారం విడుదలైంది. ఈ ప్రోమోలో ఆసక్తికరమైన అంశం ఒకటి బయటపడింది. సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, సూర్యదేవర నాగవంశీ తో జరిగిన ఇంటర్వ్యూలో బాలకృష్ణ మాటల మాంత్రికుడు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో ఫోన్ లో ముచ్చటించారు.
ఆ సంభాషణలో ‘ఈ షోకు ఎప్పుడు వస్తావ్’ అని త్రివిక్రమ్ ను బాలకృష్ణ అడిగారు. ‘మీరు ఓకే అంటే వెంటనే వచ్చేస్తాన’ని త్రివిక్రమ్ సమాధానం చెప్పాడు. అయితే వెంటనే బాలకృష్ణ… ‘ఎవరితో రావాలో తెలుసుగా’ అని అడిగారు. త్రివిక్రమ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. త్రివిక్రమ్ గనుకగా ఈ షోకు వస్తే… పవన్ కళ్యాణ్ తోనే రావాలన్నది బాలకృష్ణ కోరికగా తెలుస్తోంది. అల్లు అరవింద్ తో ఉన్న అనుబంధం దృష్ట్యా పవన్ కూడా ఈ షోకి రావడానికి పెద్దంతగా హెజిటేట్ చేయకపోవచ్చు. సో… అతి త్వరలోనే అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీ కే షో లో పవన్ అండ్ త్రివిక్రమ్ జోడీని మనం చూడొచ్చు.