Posani Krishna Murali: నటుడు పోసాని కృష్ణ మురళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. నటుడిగా, డైరెక్టర్ గా, మాటల రచయితగా.. రాజకీయ నేతగా.. ఇలా ఎన్నో అవతారాల్లో కనిపించిన పోసాని.. బుల్లితెరపై కూడా ఎన్నో షోస్ లో జడ్జిగా కనిపించాడు. సినిమాల విషయం పక్కన పెడితే.. రాజకీయాల్లో ఉంటూ.. ప్రతిపక్ష నేతలను తనదైన శైలిలో చెడుగుడు ఆడుకుంటూ ఉంటాడు. ఇక ఈ మధ్యకాలంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ తన కెరీర్ లో ఎదుర్కున్న ఆటుపోట్లను.. సినిమాలు, రాజకీయాలు, అవమానాలు, ప్రశంసలు.. ఇలా మొత్తాన్ని ఏకరువు పెడుతూన్నాడు. ఇక ఈ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూలో పోసాని.. తన చావు గురించి మాట్లాడడం హాట్ టాపిక్ గా మారింది. తాను ఇప్పటికిప్పుడు చనిపోయినా పర్వాలేదని, తన కుటుంబాన్ని అంతా సెటిల్ చేసినట్లు తెలిపాడు. అంతేకాకుండా తాను చనిపోయాక.. తన శవాన్ని కూడా ఇండస్ట్రీ వారికి చూపించకూడదని భార్యకు చెప్పినట్లు చెప్పుకొచ్చాడు.
Nandamuri Brothers: అన్నలతో తమ్ముడు.. మిలియన్ డాలర్ పిక్ అంటార్రా బాబు
” నా కుటుంబానికి నేను అంతా సెటిల్ చేసి పెట్టాను. నా భార్యను ముందుగానే ప్రిపేర్ చేసేసా.. చూడమ్మా.. నేను ఎప్పుడు చచ్చిపోయినా ఏడవద్దు. నీ పేరు మీద రూ. 50 కోట్ల ఆస్తి ఉంది. నేను చచ్చిపోయాక నీకు, పిల్లలకు ఎటువంటి ఇబ్బంది రాదు. నువ్వు ఏ పని చేయకపోయినా నెలకు రూ. 8 లక్షలు రెంట్ వచ్చేలా ఏర్పాటు చేశా.. ఇంట్లో నలుగురు పనివాళ్లను పెట్టుకో.. నువ్వు ఎక్కడికి వెళ్లినా వాళ్ళను తీసుకెళ్ళు. నేను లేను అనే బాధ నీకు ఉంటుంది. అందుకే ఇలా ఆనలుగురు నీ చుట్టూ ఉండేలా చూసుకో. నేను చనిపోయాక.. నా శవాన్ని కూడా ఇండస్ట్రీలో ఎవరికి చూపించకు. ఏ ఒక్కరు నా చావుకు సానుభూతి పడడం, ఏడవడం చేసినా నాకు నచ్చదు. ముఖ్యంగా నువ్వు కూడా ఏడవద్దు.. అని నా భార్యను ప్రిపేర్ చేసి పెట్టాను.. ” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం పోసాని వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.