Posani Krishna Murali: మెగాస్టార్ చిరంజీవి, తమన్నా నటించిన చిత్రం భోళా శంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఏకే ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుపోవడమే కాకుండా భారీ అంచనాలను రేకెత్తించాయి. రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రతిసారి పవన్ కళ్యాణ్ సినిమా కానీ, చిరంజీవి సినిమా కానీ రిలీజ్ అవుతుందంటే.. ఏపీలో టికెట్ రేట్స్ పెంచాలని ప్రభుత్వాన్ని అడగడం.. అదిపెద్ద చర్చనీయాంశం కావడం జరిగేదే. ఇక భోళా శంకర్ కు సైతం మేకర్స్ టికెట్ రేట్స్ పెంచమని అడగడం.. ఏపీ ప్రభుత్వం కాదు అని చెప్పడం జరిగాయి. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. తాజాగా టికెట్ రేట్ గురించి, చిరు, పవన్ రెమ్యూనిరేషన్స్ గురించి నటుడు పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేశాడు. గతంలో సీఎం జగన్ తో ఇండస్ట్రీ పెద్దలు ఏం మాట్లాడారో తెలుపుతూ రెమ్యూనిరేషన్స్ తగ్గించుకోమని హీరోలకు తెలిపినట్లు చెప్పుకొచ్చాడు.
Jailer Disaster: జైలర్ డిజాస్టర్.. విజయ్ ఫ్యాన్స్ అరాచకం
” గతంలో యుద్ధం జరిగినప్పుడు సినిమా ఇండస్ట్రీలో కూడా టికెట్ రేట్ పెంచండి.. కొంచెం హెల్ప్ అవుతుంది అని అప్పట్లో పెద్దలు చెప్పడం వలన టికెట్ రేట్స్ పెంచారు అని విన్నాను. మళ్లీ రేట్లు పెంచండి అని అడగడం ఇప్పుడే వింటున్నాను. అప్పుడంటే.. రీజన్ ఉంది.. యుద్ధం, ఆర్థిక వ్యవస్థ.. ఉండడం వలన పెంచారు. కానీ, ఇప్పుడు ఏం ఆర్థిక వ్యవస్థ దెబ్బ తిన్నది అని వీళ్లు టికెట్ రేట్స్ పెంచమని అడుగుతున్నారు అని అందరి ముందు జగన్ అన్నను అడిగాను. అందరు ఉన్నారు. పేర్ని నాని, చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, ఆలీ అందరు ఉన్నారు. ఇవన్నీ అన్నారో లేదో వారిని అడగండి.. నేను అనకపోతే ఇక్కడే అబద్దం చెప్పాను అని చెప్పుతో కొట్టుకుంటాను. అందరి ముందు నేనే చెప్పాను .. వీళ్లు.. 40 కోట్లు, 60 కోట్లు రెమ్యునిరేషన్ తీసుకుంటున్నారు. దేనికి పెంచాలి ఇంకా.. ఏ .. 10 కోట్లు, 20 కోట్లు తగ్గించుకొని సినిమా చేసుకోవచ్చుగా.. చిరంజీవి నా ఎదురుగా ఉన్నారు.. ఎందుకు పెంచాలి సర్.. వీళ్ళందరూ వెల్ సెటిల్డ్ .. ఎవరు సెటిల్ అవ్వలేదు.. చిన్న చిన్న జూనియర్ ఆర్టిస్టులు, లైట్ బాయ్స్, పనిచేసేవారు, చిన్న నిర్మాతలు నాశనం అయిపోయారు. నేను చెప్పింది అంతా అబద్దం అయితే.. వాళ్లనే నిజం చెప్పమనండి.. పేర్ని నాని.. నన్ను ఆపాడు. జగన్ అన్నకు సమస్య ఏంటో తెలియాలి అని ఇదంతా చెప్పాను” అని అడిగినట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం పోసాని వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.