Jailer Disaster: జైలర్ డిజాస్టర్.. విజయ్ ఫ్యాన్స్ అరాచకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jailer Disaster: హీరోలు అన్నాక ఫ్యాన్స్ ఎలా ఉంటారో యాంటీ ఫ్యాన్స్ కూడా అలాగే ఉంటారు. ఇక హీరోల ఫ్యాన్ వార్స్ చూస్తే చాలామందికి మెంటల్ ఎక్కడం ఖాయమని చెప్పాలి. ఈ ఫ్యాన్ వార్ అనేది అన్ని ఇండస్ట్రీల్లో ఉంది. టాలీవుడ్ లో ఫ్యాన్స్ వార్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే టాలీవుడ్ కన్నా కోలీవుడ్ లో ఈ ఫ్యాన్స్ వార్ మరీ దారుణంగా ఉంటాయి. ముఖ్యంగా అజిత్- విజయ్ ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అన్న విషయం తెల్సిందే. ఓకే హీరో సినిమా రిలీజ్ అయితే ఇంకొక హీరో ఫ్యాన్స్ సినిమా డిజాస్టర్ అని నెగెటివ్ టాక్ పుట్టిస్తారు. ఇక థియేటర్ లను తగలబెట్టడాలు, పోస్టర్ లను చించేయడాలు చూస్తూనే ఉన్నాం. కాగా, తాజాగా విజయ్ ఫ్యాన్స్ రజినీకాంత్ పై విరుచుకుపడుతున్నారు. నేడు రజినీ నటించిన జైలర్ సినిమా రిలీజ్ ఆయిన విషయం తెల్సిందే. ఈ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుండగా .. ఇంకోపక్క విజయ్ ఫ్యాన్స్ ట్విట్టర్ లో #JailerDisaster అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. అయితే వారు ఇలా చేయడానికి రెండు కారణాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది.
Bigg Boss Telugu 7: ఎవరి ఊహకు అందని సీజన్.. నాగ్ ఈసారి గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడే
Also Read
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
- Indraja: నటి ఇంద్రజను చూసి ఏడ్చేసిన టాలీవుడ్ నిర్మాత
అందులో మొదటిది జైలర్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్.. విజయ్ కు బీస్ట్ లాంటి పరాజయాన్ని అందించాడు. మా హీరోకు ప్లాప్ ఇచ్చి రజినీకి హిట్ ఇస్తావా.. ? అని కోపంతో ఇలా చేస్తున్నారని కొందరు అంటుండగా.. ఇంకొందరు.. జైలర్ ఆడియో లాంచ్ లో రజినీ కాకి- డేగ కథ చెప్పిన విషయం తెల్సిందే. అందులో కాకి అంటే విజయ్ అని ఫ్యాన్స్ అర్ధం చేసుకొని రజినీపై ఫైర్ అవుతున్నారని, అందుకే జైలర్ సినిమాకు నెగెటివ్ టాక్ రప్పించడానికి ఇలా చేస్తున్నారని చెప్తున్నారు. మరి ఇందులో ఏది నిజం.. ఏది అబద్దం అనేది తెలియదు కానీ.. ఇలా మంచి సినిమాను పాడు చేయడం ఎంతవరకు సమంజసం. మిగతా భాషల్లో కూడా సినిమా మంచి పాజిటివ్ టాక్ అందుకుంది. ఇప్పుడు వీళ్ళు ఇలా చేసి వారి ఇండస్ట్రీ పరువు వారే తీస్తున్నారని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు.
తాజావార్తలు
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
-
Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. ‘అనకాపల్లి’ నిర్మాత ఆవేదన!
-
Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
-
Cyber Crime Crackdown: సైబర్ ముఠాలపై బిగ్ ఆపరేషన్.. 100 మందికి పైగా అరెస్ట్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!