Posani Krishna Murali: ‘లవ్ యూ రాజా’ డైలాగ్ వెనుక అసలు కథ ఇదే.. అసలు విషయం చెప్పిన పోసాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Posani Krishna Murali: ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళి చెప్పిన ‘లవ్ యూ రాజా’ డైలాగ్ ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నేటికీ చాలామంది ఆయనను అదే పేరుతో గుర్తు చేసుకుంటుంటారు. తాజాగా ఎన్టీవీ పోడ్కాస్ట్లో పాల్గొన్న పోసాని.. ఈ డైలాగ్ ఎలా పుట్టింది? ఎలా అంత పెద్ద క్రేజ్ సంపాదించుకుంది? అనే ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో మా టీవీలో ఓంకార్ నిర్వహించిన చిన్నారుల డ్యాన్స్ షోకు తనను జడ్జిగా ఆహ్వానించారని తెలిపారు. షూటింగ్‌లతో బిజీగా ఉన్నప్పటికీ ఓంకార్ ప్రత్యేకంగా కోరడంతో ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి అంగీకరించానని చెప్పారు.
“స్టేజ్‌పై డ్యాన్స్ చేసేది చిన్నపిల్లలు కాబట్టి.. వారు ఎంత బాగా చేసినా, ఏదైనా చిన్న తప్పు జరిగినా నా కామెంట్స్ వల్ల వారు బాధపడకూడదని అనుకున్నాను. అందుకే ప్రతి పిల్లవాడిని ప్రోత్సహించేలా మాట్లాడేవాడిని. ‘నువ్వు చాలా బాగా చేశావ్.. ఇంకాస్త బాగా చేస్తే నంబర్ వన్ అవుతావ్’ అంటూ ధైర్యం చెప్పేవాడిని” అని పోసాని గుర్తు చేసుకున్నారు. అలాంటి సమయంలో ఓ చిన్నారి ప్రదర్శన ముగిసిన తర్వాత అనుకోకుండా “లవ్ యూ రాజా” అని చెప్పానని, దానికి ఆ చిన్నారి కూడా నవ్వుతూ “థాంక్యూ రాజా” అని సమాధానం చెప్పిందని తెలిపారు. నెక్ట్స్ రెండు జడ్జిమెంట్స్‌లో లవ్ యూ రాజా అని నేను అన్న తర్వాత మూడో సారి పిల్లలందరూ స్టేజ్ మీదకి వచ్చి లవ్యూ రాజా అని అన్నారని.. ఆ క్షణం అక్కడ ఉన్నవారంతా నవ్వారని, తర్వాత ప్రతి ఎపిసోడ్లో అదే మాటను ఉపయోగించడం ప్రారంభించానని చెప్పారు. ఆ కార్యక్రమం ముగిసే నాటికి ఆ డైలాగ్ తెలుగు రాష్ట్రాలన్నింటిలోనూ విపరీతంగా పాపులర్ అయిందని పోసాని వెల్లడించారు. ఇప్పటికీ సినీ పరిశ్రమలోని వారైనా, అభిమానులైనా తనను “లవ్ యూ రాజా” అని పిలుస్తుంటారని, అంతకుముందు “మెంటల్ కృష్ణ” అని పిలిచేవారని చెప్పారు. ‘ఇంత పెద్ద ఇండస్ట్రీలో నాకు ఇంత గుర్తింపు ఇండస్ట్రీలో ఉంది, ప్రజల్లో ఉంది అది నాకు అదృష్టం’ అని అన్నారు.
Also Read
- Fauji: ప్రభాస్ 'ఫౌజీ' చుట్టూ బిగ్ గేమ్.. ఆ సినిమాల రిలీజ్ డేట్లు మారతాయా?
- Ramayana Trailer: 'రామాయణ' ట్రైలర్‌కు సెన్సార్ క్లియర్.. ఆ 34 నిమిషాల ఫుటేజ్కూ గ్రీన్ సిగ్నల్!
- Sujeeth: సైలెంట్‌గా పని కానిచ్చేస్తున్న స్టార్ డైరెక్టర్..
- DC Release: దళపతి కోసం వెనక్కి తగ్గిన లోకేష్.. రిలీజ్ డేట్‌ను మార్చేసిన స్టార్ డైరెక్టర్!
తాజావార్తలు
-
Posani Krishna Murali: ‘లవ్ యూ రాజా’ డైలాగ్ వెనుక అసలు కథ ఇదే.. అసలు విషయం చెప్పిన పోసాని
-
Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు WFH.. మూడు నెలల్లోనే మిగిలిన 40 లక్షల లీటర్ల పెట్రోల్..
-
Talliki Vandanam Scheme: గుడ్‌న్యూస్.. రూ.10,049 కోట్లు విడుదల.. ‘తల్లికి వందనం’కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?
-
IND Vs ENG: ఇండియా బ్యాటింగ్.. జట్టులోకి విధ్వంసకర బ్యాటర్..
-
West Bengal: లవ్ ప్రపోజల్ రిజెక్ట్ చేసిందని, 16 ఏళ్ల బాలిక హత్య..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!