DOP Senthil Kumar:ప్రముఖ డీవోపీ సెంథిల్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన భార్య రూహీ కొద్దిసేపటి క్రితమే మృతిచెందింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలుస్తోంది. సెంథిల్ కుమార్ మరియు రూహీ 2009 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. రుహీ వృత్తిరీత్యా యోగా శిక్షకురాలు. ఆమె చాలా కాలం పాటు స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టితో కలిసి పనిచేసింది. COVID-19 నుండి రూహీకి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయి. అప్పటినుంచి ఆమె చికిత్స తీసుకుంటూనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నేడు, రూహీ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. ఆమె ఆర్గాన్స్ అన్ని ఫెయిల్ అవ్వడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలుపుతున్నారు. రూహీ మరణం పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. సెంథిల్ కుమార్ భార్యకు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.
ఇక సెంథిల్ కుమార్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజమౌళి సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మగధీర నుంచి బాహుబలి వరకు ఆయనే డీవోపీగా పనిచేశారు. ఇక ఆయన వర్క్ కు ఎన్నో అవార్డులు అందుకున్నాడు. ఇంత చిన్న వయస్సులోనే ప్రేమించే భార్యను పోగొట్టుకోవడం ఎంతో పెద్ద విషాదమని చెప్పాలి. ఈ జంటకు ఇద్దరు కుమారులు. ఇక పలువురు ప్రముఖులు.. ఆయనకు దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పుకొస్తున్నారు.