పంజాబీ బ్యూటీ పూనమ్ కౌర్ తాజాగా ఆర్జీవీని టార్గెట్ చేసింది. పైగా మరో డైరెక్టర్ నూ ఇన్వాల్వ్ చేస్తూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. “పాలిటిక్స్ ఎంటర్టైన్మెంట్ గా మారితే ఎంటర్టైన్మెంట్ పాలిటిక్స్ గా మారాయి” అంటూ మొదలెట్టిన పూనమ్ ఆర్జీవీ చేసిన ట్వీట్ ను ట్యాగ్ చేస్తూ సమాధానం ఇచ్చింది. ఆర్జీవీ నిన్న రాత్రి జరిగిన “భీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన వీడియోను జత చేస్తూ, పవన్ కళ్యాణ్ బెస్ట్ స్పీచ్ లలో ఒకటి, హార్ట్ ఫెల్ట్, ఎమోషనల్ అంటూ కామెంట్స్ చేశారు.
Read Also : BHEEMLANAYAK and GODFATHER : ఒకే సెట్ లో చిరు, పవన్
అదే ట్వీట్ కు పూనమ్ రిప్లై ఇస్తూ “ఒక దర్శకుడు మూల నుండి నవ్వుతూ, వ్యక్తిగత స్థలం కోసం బహిరంగంగా, తన వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తే, మరొక దర్శకుడు రాజకీయంగా అతనిని కించపరచడానికి ఏదైనా చేస్తాడు. ఇద్దరూ అద్దెకు, డబ్బు తీసుకునే ఏజెంట్లైనా మహిళలను ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. రాజకీయ ఎజెండా కోసం SC, ST అభ్యర్థిని ఉపయోగించడం, రాజకీయ ఎజెండా అమలు చేయడానికి ఒక మహిళను నగ్నంగా ఉంచడం, ఒక అమ్మాయి కాల్స్ ట్యాప్ చేయడం, ఆమెకు డబ్బు అందించడం, ఆమె వ్యక్తిగత జీవితాన్ని, ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేయడం, ఆమెను బెదిరించడం, నియంత్రించడం… అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో కొన్ని పనులు జరిగాయి. అయితే అతి పెద్ద నేరం ఏమిటి? మనం దేనిపై దృష్టి కేంద్రీకరిస్తాము? వివాహాలు! నిజం గెలుస్తుందని ఆశిస్తున్నాను! #సత్యమేవజయతే” అంటూ వరుసగా ట్వీట్లు చేసింది. గతంలో కొన్నిసార్లు పవన్ అంటేనే మండిపడిన ఈ బ్యూటీ ఇప్పుడు పవన్ ను సపోర్ట్ గా ట్వీట్లు చేయడం ఏంటా ? అని నెటిజన్ల మధ్య చర్చ నడుస్తోంది.
