Pooja Hegde : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తున్న కూలీ మూవీలో పూజాహెగ్డే అదిరిపోయే సాంగ్ చేస్తున్న విషయం తెలిసిందే. మోనిక సాంగ్ ప్రోమో వచ్చినప్పటి నుంచి ఫుల్ సాంగ్ కోసం ఎదురు చూశారు. ఎట్టకేలకు ఆ సాంగ్ రిలీజ్ అయింది. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ఈ బుట్టబొమ్మ స్పెషల్ సాంగ్ చేసింది. తాజా సాంగ్ లో తన ఘాటు అందాలతో ఊపేసింది. స్పీడ్ స్టెప్పులతో కుర్రాళ్లకు చెమటలు పట్టించేసింది. అసలే పూజాహెగ్డే అంటే అందాల బుట్టబొమ్మ. ఇక స్పెషల్ సాంగ్ లో ఎలా రెచ్చిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా తన ఘాటు వయ్యారాలతో ఓ ఊపు ఊపేసింది ఈ భామ.
Read Also : Chaitra Rai : మరోసారి తల్లి కాబోతున్న ‘ఎన్టీఆర్’ బ్యూటీ..
చాలా కాలంగా సౌత్ లో సినిమాలు లేక ఇబ్బంది పడుతున్న టైమ్ లో ఈ ఐటెం సాంగ్ ఆమె కెరీర్ కు బూస్ట్ ఇస్తుందని భావిస్తోంది. సమంత, శ్రీలీల ఇలాంటి ఐటెం సాంగ్స్ చేసి కెరీర్ లో స్పీడ్ పెంచేశారు. మరి పూజాహెగ్డేకు ఇది ఎంత వరకు కలిసొస్తుందో చూడాల్సిందే. పాట పరంగా చూస్తే పర్వాలేదనిపిస్తోంది. లిరిక్స్ మాస్ ఆడియెన్స్ ను ఆకట్టుకునేలాగానే ఉన్నాయి. కూలీ మూవీ ఆగస్టు 14న థియేటర్లలోకి రాబోతోంది. లోకేష్-రజినీ కాంబోలో వస్తున్న మొదటి మూవీ కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే భారీగా బిజినెస్ జరిగింది. ఏ మాత్రం హిట్ టాక్ వచ్చినా మూవీ కలెక్షన్లు భారీగానే ఉండే అవకాశాలు ఉన్నాయి.
Read Also : Vadde Naveen : ఒకప్పుడు స్టార్ హీరో.. ఇప్పుడు నిర్మాతగా రీ ఎంట్రీ..