Chaitra Rai : సీరియల్స్ తో తెలుగు నాట బాగా పాపులర్ అయింది చైత్ర రాయ్. ఇటు సినిమాల్లో కూడా రాణించింది. ఆమె తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పింది. కొన్ని రోజులుగా ఆమె రెండో సారి ప్రెగ్నెంట్ అయిందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. దానిని ఆమె తాజాగా కన్ఫర్మ్ చేసేసింది. బేబీ బంప్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నేను రెండో సారి ప్రెగ్నెంట్ అయ్యాను. కానీ ఈ విషయాన్ని ఇన్ని రోజులు సీక్రెట్ గా ఉంచాం. ఇప్పుడు మీ అందరికీ చెప్పాల్సిన టైమ్ వచ్చింది. నేను ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి మా ఫ్యామిలీ ఆనందానికి అవధుల్లేవ్. నిశ్కశెట్టి అక్కగా ప్రమోషన్ పొందబోతోంది.
Read Also : Vadde Naveen : ఒకప్పుడు స్టార్ హీరో.. ఇప్పుడు నిర్మాతగా రీ ఎంట్రీ..
మా రెండో కిడ్ కోసం మేం వెయిట్ చేస్తున్నాం అంటూ రాసుకొచ్చింది ఈ బ్యూటీ. ఈమెకు ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాతో గుర్తింపు వచ్చింది. ఇందులో కీలక పాత్రలో మెరిసింది. అంతకు ముందు తెలుగునాట దటీజ్ మహాలక్ష్మీ, అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు, ఒకరికి ఒకరు, రాధకు నీవేరా ప్రాణం సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. పెద్ద సినిమాల్లోనూ కీలక పాత్రలు చేసేందుకు ఆఫర్లు వస్తున్నాయంట. ప్రస్తుతం ప్రెగ్నెంట్ కావడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చినట్టు తెలిపింది ఈ బ్యూటీ. ఆమె డెలివరీ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
Read Also : Narayanan Murthy : అణుబాంబు కన్నా ప్రమాదమే.. ఆర్.నారాయణ మూర్తి షాకింగ్ కామెంట్స్..