బుట్టబొమ్మ పూజా హెగ్డే అరుదైన గౌరవం అందుకుంది. చిత్ర పరిశ్రమలో వరుస అవకాశాలను అందుకుంటూ బిజీగా మారిన ఈ ముద్దుగుమ్మకు తాజాగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనేందుకు ఆహ్వానం అందింది. దేశం తరపున ప్రాతినిధ్యం వహించే అరుదైన గౌరవం మన స్టార్ నటులకు చాలా తక్కువమందికి దక్కింది. ఇక ఈసారి మన బుట్టబొమ్మ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సందడి చేయనుంది. ఈ విషయాన్నీ ఆమె స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ గంగమ్మ చేసే ఈ వేదికపై పూజా పాల్గొనే అవకాశం రావడంతో అమ్మడు ఎంతో ఆనందం వ్యక్తం చేసింది.
పూజా మే 17 మరియు 18వ తారీకున ఈ అమ్మడు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనబోతున్నట్లుగా సమాచారం. అయితే ఈ వేడుకలో పూజా పాల్గొనడమే కాకుండా ఇండియా చిత్రం గురించి చిత్ర పరిశ్రమ గురించి గొప్పగా చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆ రిహార్సల్స్ లోనే పూజా నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలియడంతో ఆమె అభిమానులు ఆమెకు సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం బుట్టబొమ్మ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ ల కాంబోలో రూపొందుతున్న సినిమాలో నటిస్తిస్తోంది.. మరోపక్క బాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్స్ లో అమ్మడు నటించనుంది.