మూవీ మేకింగ్ అండ్ స్టొరీ టెల్లింగ్ జీనియస్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ నుంచి వచ్చిన సెకండ్ ఇన్స్టాల్మెంట్ ‘పోన్నియిన్ సెల్వన్ 2’ బాక్సాఫీస్ దగ్గర హ్యూజ్ కలెక్షన్స్ ని రాబడుతోంది. ఏప్రిల్ 28న రిలీజ్ అయిన ఈ మూవీ కేవలం మూడు రోజుల్లోనే 200 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. తమిళ బాక్సాఫీస్ దగ్గర చోళులు ప్రతాపం చూపిస్తున్నారు., అక్కడ తమిళులు ఉంటే అక్కడ పోన్నియిన్ సెల్వన్ 2 సినిమా సెన్సేషనల్ బాక్సాఫీస్ నంబర్స్ ని రాబడుతోంది. ఇతర ప్రాంతాల్లో కూడా మంచి టాక్ ని సొంతం చేసుకున్న PS-2 పరవాలేదనిపించే కలెక్షన్స్ ని మైంటైన్ చేస్తోంది. ఇండియాలోనే కాదు యుఎస్ మార్కెట్ లో కూడా పోన్నియిన్ సెల్వన్ 2 భారీగా వసూల్ చేస్తోంది. మూడు రోజుల్లో అమెరికా మార్కెట్ లో ౩.5 మిలియన్ డాలర్స్ రాబట్టి మంచి ఊపుమీదుంది. ఫుల్ రన్ లో పోన్నియిన్ సెల్వన్ 2 5 మిలియన్ డాలర్స్ రాబడుతుందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. పోన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 ఓవరాల్ గా 500 కోట్లు కలెక్ట్ చేసింది, పోన్నియిన్ సెల్వన్ 2 ఆ మార్క్ ని రీచ్ అవుతుందో లేదో చూడాలి.
Read Also: Niharika Konidela: కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసిన మెగా డాటర్.. ఈసారైనా
Breaking barriers and conquering the globe! #PS2 soars high and crosses over 200 crores worldwide!#PS2RunningSuccessfully #CholasAreBack#PS2 #PonniyinSelvan2 #ManiRatnam @arrahman @madrastalkies_ @LycaProductions @RedGiantMovies_ @Tipsofficial @tipsmusicsouth @IMAX… pic.twitter.com/ACB22nrrSX
— Lyca Productions (@LycaProductions) May 1, 2023