Niharika Konidela: జీవితంలో బాధలు, కష్టాలు వచ్చినప్పుడు అక్కడే ఆగిపోకూడదు..బుక్ లో కొత్త పేజీని ఓపెన్ చేసినట్లు.. కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలి. ప్రస్తుతం మెగా డాటర్ నిహారిక అదే పని చేస్తోంది. మెగా డాటర్ గా ఇండస్ట్రీకి పరిచయామైన నిహారిక.. హీరోయిన్ గా నిరూపించుకోలేకపోయింది. ఆ తరువాత చైతన్య జొన్నలగడ్డను వివాహామాడింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన నిహారిక.. నిర్మాతగా మారింది. ఇక గత కొన్నిరోజులుగా ఆమె చుట్టూ పుకార్లు మాత్రమే తిరుగుతున్నాయి. భర్తతో విబేధాలు అని, విడాకులు అని ఏవేవో చెప్పుకొస్తున్నారు. అందులో నిజం ఎంత అనేది మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఇక ఈ రూమర్స్ నుంచి బయటపడడానికి నిహారిక మళ్లీ కొత్త అవతారంలో కనిపించింది. నటిగా రీ ఎంట్రీ ఇచ్చింది. ఈసారి వెండితెరపై కాదు ఓటిటీ ఎంట్రీ ఇచ్చింది. ఓటిటీ ఆమెకు కొత్తకాదు.. ఇప్పటికే ఆమె ముద్దపప్పు ఆవకాయ, నాన్న కూచి లాంటి వెబ్ సిరీస్ లను సమర్థవంతంగా తెరకెక్కించి,నటించింది. ఇక తాజాగా డెడ్ పిక్సల్స్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Nabha Natesh: అమ్మడి ఒంటి సొగసుపై చున్నీ నిలవంటుందే
నిహారిక కొణిదెల, అక్షయ్ లంగుసాని, వైవా హర్ష, సాయి రోనాక్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన వెబ్ సిరీస్ డెడ్ పిక్సల్స్. ఆదిత్య మండల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ ను బీబీసీ స్టూడియోస్ ఇండియా అండ్ తమడ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా డెడ్ పిక్సల్స్ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం యువత.. రియాలిటీ లో కంటే.. ఇమాజినేషన్ లోనే బతుకుతున్నారు. ముఖ్యంగా వీడియో గేమ్స్ ప్రభావం యువతపై ఎలా ఉంది అనేది ఈ సిరీస్ ప్రధానాంశంగా తెలుస్తోంది. గాయత్రీ, భార్గవ్, ఆనంద్, రోషన్ అనే నలుగురు స్నేహితులు.. ఒక గేమ్ లో పాల్గొంటారు. ఆ గేమ్ నుంచి బయటికి రాలేరు.. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని వదిలి అదే జీవితం అన్నట్లు గడపడం టీజర్ లో చూపించారు. అసలు ఆ గేమ్ ఏంటి..? ఎందుకు వారు ఆ గేమ్ కు ఎడిక్ట్ అయ్యారు. ఆ గేమ్ వలన వారి జీవితాల్లో జరిగిన పర్యవసానాలు ఏంటి ..? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే. ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మే 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మరి మెగా డాటర్ రీఎంట్రీ ఆమె జీవితాన్ని ఎలా మారుస్తుందో చూడాలి.
https://www.youtube.com/watch?v=8_jKy1URdXs