బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నారు. ఆయనతో పాటు దాదాపు 150 మందిని , పబ్ యజమానిని కూడా పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. బంజారాహిల్స్ లోని ఓ పబ్ లో తాజాగా పోలీసులు దాడులు జరిపారు. పోలీసులకు ర్యాడిసన్ బ్లూ హోటల్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఆ పట్టుబడిన 150 మంది రాజకీయ, సినీ ప్రముఖుల పిల్లలు ఉన్నట్లు సమాచారం.
Read Also : Malaika Arora : కార్ యాక్సిడెంట్… స్టార్ హీరోయిన్ కు గాయాలు
పుడింగ్ మిగ్ పబ్ లో తెల్లవారే వరకు నిర్వహిస్తూ యాజమాన్యం హంగామా సృష్టిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ దాడుల్లో రాహుల్ సిప్లిగంజ్, ఉప్పల్ అనిల్ కుమార్, నిహారిక, సిరీస్ రాజు కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు. ర్యాడిసన్ బ్లూ హోటల్ లోని పబ్ ని అధికారులు సీజ్ చేశారు. గతంలో కూడా రాహుల్ పై ఓ పబ్ లో దాడి జరిగిన విషయం తెలిసిందే. మరోమారు పబ్ సంఘటనలోనే రాహుల్ దొరికిపోవడం సంచలనంగా మారింది.