Pindam: సినిమా మొదలుపెట్టగానే.. అమ్మ చనిపోయింది.. వింత సంఘటనలు.. ప్యాంట్ తడవడం ఖాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pindam: హీరో శ్రీకాంత్ శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటిస్తున్న చిత్రం పిండం. ది స్కేరియస్ట్ ఫిల్మ్ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక దీపావళి కానుకగా చిత్ర బృందం ఓ ప్రత్యేక వీడియో విడుదల చేసింది. నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ కలిసి సినిమా ఎలా ఉండబోతుంది, చిత్రీకరణ ఎలా సాగింది అని వివరించడం ఆకట్టుకుంది. వీడియోలో మేకింగ్ కి సంబంధించిన విజువల్స్ కూడా చూపించారు. ట్రైలర్ తోనే ఈ సినిమా ఎంత భయపెడుతుందో చూచాయగా చెప్పేశారు. పిండం అనేది కంప్లీట్ హారర్ చిత్రంగా ఉండబోతుంది. ఇంతటి భయానక హారర్ చిత్రాన్ని టాలీవుడ్ ఇంతవరకూ చూడలేదని చిత్ర బృందం చెబుతోంది. పిండం కథ ప్రస్తుతం అలాగే 1990 మరియు 1930 లలో.. మూడు కాలక్రమాలలో జరిగేదిగా కనిపిస్తుంది. స్క్రీన్‌ప్లే ఈ చిత్రానికి హైలైట్‌గా నిలవనుంది.
ఇక పిండం ప్రెస్ మీట్ లో హీరో శ్రీకాంత్ శ్రీరామ్ మాట్లాడుతూ.. “పిండం అనేది స్ట్రయిట్, క్లియర్, సీరియస్ హారర్ జానర్. మామూలుగా కొన్ని హారర్ సినిమాల్లో సాంగ్స్, కామెడీ ట్రాక్ లు ఉంటాయి. అలాంటివేం లేకుండా మిమ్మల్ని భయపెట్టడం కోసం తీసిన స్ట్రయిట్ హారర్ ఫిల్మ్ ఇది. థియేటర్లలో మీకు ఖచ్చితంగా ఓ కొత్త అనుభూతిని ఇస్తుంది” అని చెప్పుకొచ్చాడు.
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
ఇక దర్శకుడు సాయికిరణ్ దైదా మాట్లాడుతూ.. “ఒక నిజ జీవిత ఘటనను తీసుకొని నేను, నా సహ రచయిత కవి సిద్ధార్థ గారు కలిసి అద్భుతమైన కథగా మలిచాము. నేను దెయ్యాలు గురించి చెప్తే భయపడే మనిషిని కాదు కానీ, ఈ కథ నన్ను కొంచెం భయపెట్టింది. చిత్రీకరణ సమయంలో మాకు కొన్ని వింత అనుభవాలు ఎదురయ్యాయి. సినిమా కోసం ఒక పాపను ఎంపిక చేస్తే వాళ్ళ అమ్మ చనిపోవడం, లైట్ మ్యాన్ కింద పడటం సహా పలు సంఘటనలు జరిగాయి. అవన్నీ గుర్తొచ్చి ఒక్కోసారి రాత్రిళ్ళు నిద్ర కూడా పట్టేది కాదు. ఒకసారి అమావాస్య అని తెలియకుండా అర్ధరాత్రి షూట్ ప్లాన్ చేశాం. షూట్ చేస్తుండగా అమావాస్య అని తెలిసి, అప్పటివరకు జరిగిన ఘటనల దృష్ట్యా అందరం బొట్లు పెట్టుకొని షూట్ చేశాం. ఈ సినిమాలో ఉన్నన్ని హారర్ బ్లాక్స్ మరే సినిమాలో ఉండవు. ఖచ్చితంగా భయపడతారు. ఒక్కరే కూర్చొని ఈ సినిమా చూడలేరు” అని చెప్పుకురావడమే కాకుండా ప్యాంట్ తడవడం ఖాయం అని నమ్మకంగా చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!