Pic Of The Day: ఇద్దరు గజినీలు ఒకే ఫ్రేమ్ లో.. చూడడానికి రెండు కళ్లు చాలడం లేదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pic Of The Day: సాధారణంగా ఒక సినిమా ఒక భాషలో హిట్ అయితే.. ఇంకో భాషలో రీమేక్ అవుతుంది అనేది అందరికి తెలుసు. అలా ఒరిజినల్, రీమేక్ చేసిన హీరోలు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఎలా ఉంటుంది. ప్రస్తుతం అలాంటి ఒక అరుదైన కలయిక జరిగింది. గజినీ.. ఈ పేరు వినగానే టక్కున ఇద్దరు హీరోలు మైండ్ లో మెదులుతారు. వారే.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్. సూర్య, ఆసిన్ జంటగా ఎ. ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గజినీ. 2005 లో రిలీజైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని రికార్డ్ కలక్షన్స్ రాబట్టింది. ఇక సూర్యను తెలుగువారికి దగ్గరచేసిన సినిమా అంటే గజినీ అనే చెప్పుకోవాలి. ఇప్పటికి కూడా గజినీ సాంగ్ ఎక్కడో ఒక చోట ప్లే అవుతూనే ఉంటాయి. ఇక ఇదే సినిమాను 2008 లో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ రీమేక్ చేశాడు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించడం విశేషం. ఇక హిందీలో కూడా గజినీ భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాల తరువాత అమీర్ ఖాన్, సూర్య కెరీర్స్ మారిపోయాయి.
Venky Kudumula: డైరెక్టర్ ఇంట విషాదం.. దయచేసి ఆ పని చేయకండి అంటూ ట్వీట్
Also Read
- Sunitha : నా నవ్వు, నా ఏడుపు, నా హస్కీ వాయిస్.. అన్నిటినీ సొసైటీ జడ్జ్ చేస్తూనే ఉంది
- Sunitha : మై బాడీ మై రైట్ అంటే, వాడి కళ్ళు వాడి ఇష్టం!" ఫెమినిజంపై సునీత షాకింగ్ కామెంట్స్!
- Samantha: సింగిల్స్‌కు సమంత పవర్ఫుల్ అడ్వైజ్.. ఆ ఒక్క క్వాలిటీ ఉంటేనే ఓకే చెప్పండి!
- Singer Sunitha: సినీ ఇండస్ట్రీ స్త్రీలకు సేఫ్ కాదు: సింగర్ సునీత
ఇక తాజాగా ఈ ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో కనిపించి కనువిందు చేశారు. ఈ అరుదైన కలయికకు వేదికగా మారింది కమల్ హాసన్ బర్త్ డే బాష్. నేడు కమల్ పుట్టినరోజు కావడంతో.. బిగ్ పార్టీని నిర్వహించారు. ఈ పార్టీకి సూర్య తో పాటు కోలీవుడ్ మొత్తం కదిలివచ్చింది. ఇక కమల్ స్నేహితులు కూడా అటెండ్ అయ్యారు. అందులో అమీర్ ఖాన్, కన్నడ స్టార్ హీరో శివన్న కూడా ఉన్నారు. ఈ పార్టీలో వారందరూ కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక ఈ ఫోటోను చూసిన అభిమానులు ఇద్దరు గజినీలు ఒకే ఫ్రేమ్ లో.. చూడడానికి రెండు కళ్లు చాలడం లేదే అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
తాజావార్తలు
-
Story Board : నాలుగోసారి గెలవడానికి.. మోడీ దగ్గరున్న త్రిశూల వ్యూహాలేంటి..?
-
Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
-
T20 World Cup: ఆమె భర్త కోసం ప్రాక్టీస్ ఎగ్గొట్టింది.. చివరకు డ్రెస్సింగ్ రూమ్‌లో పరువు పోయింది..
-
Golconda Hostel Incident : గోల్కొండ హాస్టల్లో షాక్.. బాత్రూంలో ప్రసవం, శిశువు మృతి!
-
Off The Record: ఉదయగిరి టీడీపీలో అంతర్గత విభేదాలు? ఆయనపై అసంతృప్తి పెరుగుతోందా?
ట్రెండింగ్
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!
-
Kitchen Tips : చెక్క, ప్లాస్టిక్, స్టీల్.. వంటగదికి ఏ చాపింగ్ బోర్డు ఆరోగ్యకరమో తెలుసా..?
-
సూపర్‌కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!