CII Partnership Summit: 141 ఒప్పందాలు.. 2.46 లక్షల ఉద్యోగాలు.. విశాఖలో పెట్టుబడుల పండుగ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CII Partnership Summit: ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు, ఉపాధి అవకాశాలే లక్ష్యంగా విశాఖపట్నం వేదికగా నేటి నుంచి CII పార్ట్నర్షిప్ సమ్మిట్ ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ అంతర్జాతీయ సదస్సు ద్వారా రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. ఈ రెండు రోజుల సదస్సులో భాగంగా మొత్తం 141 అవగాహన ఒప్పందాలు (MoUs) కుదుర్చుకోవాలని లక్ష్యంగా నిర్ణయించారు. వీటి ద్వారా సుమారు రూ.12.14 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ పెట్టుబడుల ద్వారా దాదాపు 2.46 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
ఇక, సదస్సులో ఐదు కీలక రంగాలపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ఆయా రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, పారిశ్రామిక అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికలపై చర్చలు జరగనున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని వివరించడంతో పాటు అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ఈ సదస్సును వేదికగా ఉపయోగించుకోనున్నారు. ఈ అంతర్జాతీయ సదస్సుకు 18 మంది విదేశీ మంత్రులు హాజరుకానున్నారు. అలాగే 58 దేశాల నుంచి సుమారు 3,500 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. అంతర్జాతీయ స్థాయిలో విశాఖపట్నానికి గుర్తింపు తీసుకురావడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడుల గమ్యస్థానంగా నిలబెట్టేందుకు ఈ సదస్సు కీలకంగా మారనుంది… ఓ వైపు సంక్షేమ అందిస్తూనే.. మరోవైపు అభివృద్ధిపై ఫోకస్ పెట్టిన కూటమి ప్రభుత్వం.. పెట్టుబడులే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది..
Also Read
- Amit Shah Vizag Visit Cancelled: హోంమంత్రి విశాఖ పర్యటనకు బ్రేక్.. అమిత్ షా పర్యటన రద్దు
- Amit Shah Vizag Visit: నేడు విశాఖకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. రెండు కీలక సదస్సులకు శ్రీకారం
- Selfie Video : రష్యా యుద్ధ క్షేత్రంలో ఐదుగురు తెలుగు యువకులు.. ‘ఇదే మా చివరి రోజు కావచ్చు’.!
- AP Municipal Elections: జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి సీట్ల సర్దుబాటు పూర్తి.. ఏ పార్టీకి ఎన్ని స్థానాలంటే..?
తాజావార్తలు
-
Infinix Xpad 30: 11 ఇంచుల FHD+ డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో Infinix Xpad 30 ట్యాబ్లెట్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
CII Partnership Summit: 141 ఒప్పందాలు.. 2.46 లక్షల ఉద్యోగాలు.. విశాఖలో పెట్టుబడుల పండుగ!
-
IPL 2027 Auction: ఐపీఎల్ 2027 వేలానికి బీసీసీఐ గ్రీన్ సిగ్నల్? వేలంలో 7 మంది బంగ్లాదేశ్ ఆటగాళ్లు..!
-
RBI Money Transfer Update: RBI కొత్త మనీ ట్రాన్స్ఫర్ రూల్స్.. బ్యాంక్ ఖాతా లేకున్నా NEFT ద్వారా రూ.50,000 పంపొచ్చు!
-
CM Vijay: ఎమ్మెల్యేలకు సీఎం విజయ్ సీరియస్ వార్నింగ్.. నేడు మరోసారి కీలక భేటీ
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!